INDAvsAUSA: కామెరూన్ గ్రీన్ అజేయ శతకం... ఆస్ట్రేలియాకి స్వల్ప ఆధిక్యం...

First Published Dec 7, 2020, 1:05 PM IST

INDAvsAUSA: అజింకా రహానే కెప్టెన్సీలో భారత్ ఏ జట్టు ఆడుతున్న మూడో రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది. టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో అజింకా రహానే అజేయ శతకంతో రాణించగా... ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు బాగానే రాణించారు. అయితే కామెరూన్ గ్రీన్ అజేయ సెంచరీతో పాటు టీమ్ పైన్ రాణించి ఆసీస్‌కి స్వల్ప ఆధిక్యం అందించారు...

ఓవర్‌నైట్ స్కోరు 2378 వద్ద రెండో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత ఏ జట్టు... సిరాజ్ వికెట్ త్వరగా కోల్పోయింది...
undefined
సిరాజ్ పరుగులేమీ చేయకుండానే టీమిండియా స్కోరు 246 పరుగులు ఉన్నప్పుడు అవుట్ అయ్యాడు...
undefined
242 బంతుల్లో 18 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 117 పరుగులు చేసిన అజింకా రహానే... బౌలర్లకు ప్రాక్టీస్ దక్కాలనే ఉద్దేశంతో 2479 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు.
undefined
భారత బౌలర్లు రహానే నిర్ణయానికి పూర్తి న్యాయం చేసినట్టే కనిపించారు. ఆసీస్ ఏ జట్టు ఓపెనర్ విల్ పుకెవిస్కీ, జో బర్గ్స్‌లను ఉమేశ్ యాదవ్ అవుట్ చేశాడు...
undefined
5 పరుగులకే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది ఆస్ట్రేలియా ఏ జట్టు. ఈ దశలో మార్కస్ హారీస్, ట్రావిస్ హెడ్ కలిసి మూడో వికెట్‌కి 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు...
undefined
60 బంతుల్లో 5 ఫోర్లతో 35 పరుగులు చేసిన హారిస్‌ను రవిచంద్రన్ అశ్విన్ అవుట్ చేయగా...
undefined
35 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్‌ను మహమ్మద్ సిరాజ్ క్లీన్‌బౌల్డ్ చేశాడు...
undefined
32 బంతుల్లో 4 ఫోర్లతో 23 పరుగులు చేసిన నిక్ మాడిసన్ కూడా అశ్విన్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా ఏ జట్టు.
undefined
అయితే టిమ్ పైన్, కామెరూన్ గ్రీన్ కలిసి ఆసీస్‌ను ఆదుకున్నారు. ఆరో వికెట్‌కి 104 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడిని ఉమేశ్ యాదవ్ విడదీశాడు..
undefined
88 బంతుల్లో 4 ఫోర్లతో 44 పరుగులు చేసిన టిమ్ పైన్... ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో పృథ్వీషాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
undefined
జేమ్స్ ప్యాటిన్సన్ 3 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో అవుట్ కాగా... 57 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసిన మైఖేల్ నిజర్‌ను సిరాజ్ రనౌట్ చేశాడు.
undefined
కామెరూన్ గ్రీన్ 173 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 114 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు..
undefined
రెండో రోజు ఆట ముగిసేసమయానికి 85 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసిన ఆస్ట్రేలియా ఏ, భారత ఏ జట్టుపై 39 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది...
undefined
భారత ఏ బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు తీయగా మహమ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్ రెండేసి వికెట్లు తీశారు...
undefined
click me!