ఛాన్స్ ఇస్తే వరల్డ్ కప్ ఆడతా! లేదంటే నా పని నేను చూసుకుంటా... - శార్దూల్ ఠాకూర్

Published : Aug 02, 2023, 01:11 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో శార్దూల్ ఠాకూర్‌కి చోటు దక్కుతుందా? జస్ప్రిత్ బుమ్రా కోలుకోవడంతో అతనితో పాటు మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీలను వన్డే వరల్డ్ కప్ ఆడించాలని సెలక్టర్లు భావిస్తే... నాలుగో పేసర్‌గా ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది..   

PREV
18
ఛాన్స్ ఇస్తే వరల్డ్ కప్ ఆడతా! లేదంటే నా పని నేను చూసుకుంటా... - శార్దూల్ ఠాకూర్
India vs West Indies

ప్రసిద్ధ్ కృష్ణ గాయం నుంచి కోలుకోవడంతో ఐర్లాండ్ టూర్‌లో అతని ప్రదర్శన బాగుంటే.. అతనికి ఆసియా కప్ 2023, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీల్లో చోటు దక్కొచ్చు. అంతేకాకుండా వెస్టిండీస్‌ టూర్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన ముకేశ్ కుమార్, మంచి ప్రదర్శనతో మెప్పించాడు..
 

28
Mukesh Kumar

రెండో వన్డేలో మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 17 పరుగులు ఇచ్చిన ముకేశ్ కుమార్, వికెట్ మాత్రం తీయలేకపోయాడు. అయితే నిర్ణయాత్మక మూడో వన్డేలో మొదటి ఓవర్ వేసిన ముకేశ్ కుమార్, తన మొదటి నాలుగు ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టాడు..  
 

38
Shardul Thakur


ఇదే మ్యాచ్‌లో 6.3 ఓవర్లు బౌలింగ్ చేసిన శార్దూల్ ఠాకూర్, 4 వికెట్లు తీశాడు. వన్డే సిరీస్‌లో 8 వికెట్లు తీసి, టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. 2017లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన శార్దూల్ ఠాకూర్, వన్డేల్లో 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు..

48
Shardul Thakur

‘వన్డే సిరీస్‌లో 8 వికెట్లు తీయడం సంతోషంగా ఉంది. క్రికెటర్లుగా ఒక్క అవకాశం కోసం ఏళ్ల పాటు వేచి చూడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు వర్కవుట్ అయినట్టు, మరికొన్ని సార్లు కాకపోవచ్చు. అయితే ఏ సిరీస్ అయినా నా కాన్ఫిడెన్స్ మెరుగుపర్చుకునేలా ప్రయత్నిస్తా...

58
Image credit: PTI

నా చోటు ఎలా దక్కించుకోవాలా అని నేను ఎక్కువగా ఆలోచించను. ఎందుకంటే టీమ్‌లో స్థిరమైన చోటు ఉండాలని కోరుకునే టైపు ప్లేయర్‌ని కాదు నేను. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి నన్ను ఎంపిక చేయకపోయినా నేనేం పెద్దగా ఫీల్ కాను..

68
Image credit: Getty

ఎందుకంటే ఫీల్ అయినంత మాత్రాన నాకు చోటు ఇవ్వరు. ఒకవేళ వన్డే వరల్డ్ కప్ టోర్నీలో నేను ఆడాలని వాళ్లు కోరుకుంటే, ఎంపిక చేస్తారు. గత రెండేళ్లలో నాకు తెలిసి నేను ఒకే ఒక్క వన్డే సిరీస్‌ మిస్ అయ్యాను. శ్రీలంకతో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌‌లో నన్ను ఎంపిక చేయలేదు, ఎందుకనే విషయం నాక్కూడా తెలీదు..
 

78

ఆల్‌రౌండర్‌గా లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేయడం చాలా క్లిష్టమైన పని. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. మూడు విభాగాల్లో నన్ను నేను పరీక్షించుకుంటా. అయితే వన్డే వరల్డ్ కప్‌ గెలవాలంటే కొందరు ప్లేయర్లు కావాలని మేనేజ్‌మెంట్ అనుకోవచ్చు..

88

అలా అనుకునే ప్లేయర్ల లిస్టులో నేను ఉంటే హ్యాపీ, లేకపోయినా పర్లేదు. తర్వాతి మ్యాచ్‌లో నా బెస్ట్ ఇవ్వడంపైనే ఫోకస్ పెడతా. ఎందుకు నాకు చోటు దక్కలేదని ఆలోచిస్తూ అయితే కూర్చోను...’ అంటూ కామెంట్ చేశాడు శార్దూల్ ఠాకూర్.. 

click me!

Recommended Stories