ఆసియా కప్‌లోనూ కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఆడడం కష్టమే! ఐర్లాండ్ టూర్ తర్వాత...

Published : Aug 02, 2023, 12:42 PM IST

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ని గెలిచిన టీమిండియా, ఆగస్టు 3 నుంచి ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో ఆడనుంది. నిజానికి వన్డే వరల్డ్ కప్‌ ముందు టీ20 సిరీస్ ఎందుకని విమర్శలు వచ్చాయి, అయితే వచ్చే ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ జరగబోతుండడంతో ఈ టీ20 సిరీస్‌కి ప్రాధాన్యం వచ్చింది... 

PREV
18
ఆసియా కప్‌లోనూ కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఆడడం కష్టమే! ఐర్లాండ్ టూర్ తర్వాత...
Yashasvi Jaiswal

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ద్వారా యశస్వి జైస్వాల్, తిలక్ వర్మలకు పొట్టి ఫార్మాట్‌లో అవకాశం దక్కనుంది. ఆ తర్వాత ఐర్లాండ్‌ టూర్‌లో రింకూ సింగ్, జితేశ్ శర్మ వంటి కుర్రాళ్లు.. అంతర్జాతీయ ఆరంగ్రేటం చేయబోతున్నారు...
 

28
Jasprit Bumrah

వెస్టిండీస్ టూర్ ముగిసిన తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్ హార్ధిక్ పాండ్యాతో పాటు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ స్వదేశానికి తిరిగిరాబోతున్నారు. ఏడాదిగా టీమ్‌కి దూరంగా ఉన్న జస్ప్రిత్ బుమ్రా కెప్టెన్సీలో ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది భారత జట్టు...

38
Prasidh Krishna

గాయంతో ఆసియా కప్ 2022 టోర్నీ ఆడని జస్ప్రిత్ బుమ్రా, ఏడాది తర్వాత రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అలాగే చాలా రోజులుగా గాయంతో బాధపడుతున్న ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఈ సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు..

48
Shreyas Iyer

అయితే కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లకు కూడా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో చోటు దక్కలేదు. ఐర్లాండ్ టూర్ ముగిసిన తర్వాత నేరుగా ఆసియా కప్ 2023 టోర్నీ ఆడనుంది భారత జట్టు.

58

గత ఏడాది ఆసియా కప్‌కి ముందు కూడా కెఎల్ రాహుల్ గాయంతో చాలా రోజుల పాటు టీమ్‌కి దూరంగా ఉన్నాడు... నేరుగా ఆసియా కప్ ఆడి, అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. 

68

‘జస్ప్రిత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వడం టీమ్‌కి ఎంతో ఎనర్జీని ఇస్తుంది. అతను 24 క్యారెట్ గోల్డ్. భారత జట్టుకి ఎంతో విలువైన ఆస్తి. బుమ్రా టీ20లు ఆడడమే కాదు, కెప్టెన్సీ చేయబోతున్నాడు... 

78

అయితే కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ సంగతేంటి? వాళ్లు ఇంకా కోలుకోలేదా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆసియా కప్ 2023 సమయానికి ఈ ఇద్దరూ కోలుకోకపోతే, నేరుగా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆడించడం పెద్ద రిస్కే అవుతుంది.. ’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. 

88

కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌నెస్ గురించి సరైన అప్‌డేట్ రాకపోవడం వల్లే వెస్టిండీస్ టూర్‌లో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలు చేసిందని సమాచారం.. 

click me!

Recommended Stories