Shreyas Iyer: పరిమిత ఓవర్ల క్రికెట్ లో మెరుగైన ప్రదర్శన చేస్తున్న టీమిండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కు ఇటీవలే భారత టెస్టు జట్టులో కూడా చోటు దక్కింది.
ఇటీవలే టీమిండియా టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కు అసలు పరీక్ష దక్షిణాఫ్రికా పర్యటనలో ఎదురు కానుందని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు.
27
న్యూజిలాండ్ తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా కాన్పూర్ లో ముగిసిన తొలి టెస్టులో అతడు అరంగ్రేటం చేసి సెంచరీ, హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక సౌతాఫ్రికా టూర్ నేపథ్యంలో గంగూలీ మాట్లాడుతూ.. ‘ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సుమారు పదేండ్లుగా బ్యాటింగ్ లో సుమారు 50 కి పైగా సగటు అనేది మాములు విషయం కానేకాదు.
37
అలాంటి ఆటగాడిని మిస్ చేసుకోవద్దు. అంతర్జాతీయ స్థాయిలో అతడు రాణించడానికి తగిన అవకాశాలివ్వాలి.. కాన్పూర్ తో జరిగిన టెస్టులో అతడు అద్భుతంగా రాణించాడు.
47
కానీ అతడికి అసలు పరీక్ష దక్షిణాఫ్రికాలో ఎదురుకానుంది. ఎందుకంటే అక్కడి బౌన్సీ, పేస్ పిచ్ లపై శ్రేయస్ ఏ మేరకు రాణిస్తాడో చూడాల్సి ఉంది. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ లలో పిచ్ ల మీద ఆడితేనే అతడి అసలు టాలెంట్ బయటపడుతుంది.
57
అయితే ఇక్కడి మాదిరే దక్షిణాఫ్రికాలో కూడా అతడు మెరుగ్గా రాణిస్తాడని నేను ఆశిస్తున్నాను..’ అని దాదా చెప్పుకొచ్చాడు.
67
దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత జట్టు.. డిసెంబర్ 26 న తొలి టెస్టు ఆడనున్న విషయం తెలిసిందే. ఒమిక్రాన్ వైరస్ నేపథ్యంలో పూర్తిస్థాయి బయో బబుల్ లో జరుగుతున్న ఈ టెస్టు సిరీస్ లో గెలిచేందుకు టీమిండియా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది.
77
దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులు ఆడేందుకు అక్కడికి వెళ్లిన టీమిండియా.. నిన్న రాత్రి జోహన్నస్బర్గ్ విమానాశ్రంలో ల్యాండ్ యింది. కాగా, టెస్టుల కోసం ప్రకటించిన 18 మందిలో శ్రేయస్ అయ్యర్ కూడా ఒకడు.