ఎన్‌సీఏకి చేరుకున్న రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా... వన్డే సిరీస్ సమయానికి సిద్ధమయ్యేందుకు...

Published : Dec 17, 2021, 12:00 PM IST

గాయం కారణంగా సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కి దూరమైన రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా... తిరిగి ఫిట్‌నెస్ సాధించేందుకు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి చేరుకున్నారు. టెస్టు సిరీస్‌కి దూరమైన ఈ ఇద్దరూ, వన్డే సిరీస్‌లో ఆడేందుకు సిద్ధమవుతున్నారు...

PREV
19
ఎన్‌సీఏకి చేరుకున్న రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా... వన్డే సిరీస్ సమయానికి సిద్ధమయ్యేందుకు...

టెస్టు సిరీస్‌కి వైస్ కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మ, టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ఆధ్వర్యంలో ముంబైలో ఏర్పాటు చేసిన మినీ క్యాంపులో పాల్గొన్నాడు...

29

రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, కెఎల్ రాహుల్, అజింకా రహానే, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా పాల్గొన్న ఈ మినీ క్యాంపులో రోహిత్ శర్మకు గాయమైందని, అతన్ని టెస్టు సిరీస్ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...

39

ఓపెనర్ రోహిత్ శర్మ స్థానంలో గుజరాత్ ఓపెనర్, భారత్- ఏ జట్టు కెప్టెన్ ప్రియాంక్ పంచల్‌కి సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ జట్టులో చోటు కల్పించారు సెలక్టర్లు...

49

కొన్ని పర్సనల్ పనులను పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ, తిరిగి ఫిట్‌నెస్ సాధించేందుకు జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకున్నాడు. అక్కడ భారత అండర్19 కెప్టెన్ యశ్ దుల్‌తో కలిసి దిగిన ఫోటో, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది...

59

అలాగే తొలి టెస్టులో గాయపడిన భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఫిట్‌నెస్ సాధించేందుకు ఎన్‌సీఏకి చేరుకున్నాడు...

69

తరుచూ గాయపడుతుండడంతో రవీంద్ర జడేజా, టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకోవాలని, వన్డే, టీ20ల్లో సుదీర్ఘ కాలం కొనసాగాలని భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి...

79

అయితే ఈ వార్తలపై తనదైన స్టైల్‌లో స్పందించాడు రవీంద్ర జడేజా.. ‘ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది...’ అంటూ టీమిండియా టెస్టు జెర్సీలో దిగిన ఫోటోను పోస్టు చేశాడు జడ్డూ...

89

రాహుల్ ద్రావిడ్, టీమిండియా హెడ్ కోచ్‌ బాధ్యతలు తీసుకోవడంతో అతని స్థానంలో ఎన్‌సీఏ హెడ్‌గా భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే...

99

అండర్-19 వరల్డ్‌కప్‌ టోర్నీకి ఎంపికైన భారత యువ జట్టుతో పాటు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా అండ్ కో... వీవీఎస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో తిరిగి ఫిట్‌నెస్‌ సాధించేందుకు కృషి చేస్తున్నారు..

Read more Photos on
click me!

Recommended Stories