పాపం శ్రేయాస్ అయ్యర్... ఆ ఒక్క మ్యాచ్ ఆడకుండా ఉండి ఉంటే, ఈపాటికి టీమిండియా కెప్టెన్‌గా...

First Published Jan 18, 2022, 6:09 PM IST

టీమిండియాలో బ్యాడ్‌లక్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా విరాట్ కోహ్లీ గురించి చెబుతారు చాలామంది. కీలక మ్యాచుల్లో టాస్ ఓడిపోవడం విరాట్ బ్యాడ్‌ లక్. మ్యాచ్ ఓడినా వాతావరణం సహకరించక టైటిల్ కోల్పోతుంటాడు కోహ్లీ. అయితే ఈ విషయంలో విరాట్‌కే పోటీ ఇస్తున్నాడు శ్రేయాస్ అయ్యర్...

టీమిండియాని ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న ప్రధాన సమస్య నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే సరైన బ్యాట్స్‌మెన్ లేకపోవడం... అంబటి రాయుడు పర్వాలేదనిపించినా, అతనికి సరైన అవకాశాలు దక్కలేదు...

2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో ప్లేస్ దక్కకపోవడంతో అంబటి రాయుడు అర్ధాంతరంగా రిటైర్మెంట్ ప్రకటించడం, మళ్లీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం జరిగిపోయాయి...

అంబటి రాయుడి తర్వాత నాలుగో స్థానంలో పర్ఫెక్ట్ బ్యాట్స్‌మెన్‌గా రాణించాడు శ్రేయాస్ అయ్యర్. ఈ ముంబై బ్యాట్స్‌మెన్ క్లాస్ బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు...

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి కెప్టెన్‌గా తన లీడర్‌షిప్ స్కిల్స్‌తో రికీ పాంటింగ్ లాంటి దిగ్గజ కెప్టెన్లను కూడా ఇంప్రెస్ చేశాడు శ్రేయాస్ అయ్యర్...

టీమిండియా తర్వాతి కెప్టెన్ అయ్యరే అని అందరూ ఫిక్స్ అయిపోతున్న దశలో ఓ సంఘటన, అతని కెరీర్ గ్రాఫ్‌ని తలకిందులు చేసేసింది...

మార్చి 2021లో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన శ్రేయాస్ అయ్యర్... ఏకంగా నాలుగు నెలల పాటు క్రికెట్‌కి దూరమయ్యాడు...

ఐపీఎల్‌ 2021 సీజన్ ఫస్టాఫ్‌తో పాటు శ్రీలంకతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌కి దూరమయ్యాడు శ్రేయాస్ అయ్యర్. ఫిట్‌గా ఉండి ఉంటే, లంకలో పర్యటించిన జట్టుకి ధావన్ స్థానంలో అయ్యరే కెప్టెన్‌గా వ్యవహరించి ఉండేవాడు...

గాయం నుంచి కోలుకుని వచ్చే లోపు ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీని రిషబ్ పంత్ తన్నుకుపోతే, టీమిండియాలో నాలుగో స్థానంలో ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్... అదిరిపోయే పర్ఫామెన్స్‌తో తన ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాడు...

అహ్మదాబాద్ టీమ్‌కి శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ అవుతాడని ప్రచారం జరిగినా, అది వీలుకాలేదు. అహ్మదాబాద్‌ జట్టు హార్ధిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇవ్వడంతో అయ్యర్, వేరే జట్లవైపు ఆశగా చూస్తున్నాడు...

మధ్యలో గాయం కారణంగా గ్యాప్ రాకుండా ఉండి ఉంటే, ఈపాటికి టీమిండియాకు వైస్ కెప్టెన్‌గా ఎంపికై, సౌతాఫ్రికా టూర్‌లో వన్డే సారథిగా మారేవాడు శ్రేయాస్ అయ్యర్...

అయితే ఇప్పుడు అటు ఐపీఎల్‌లో రిషబ్ పంత్ కారణంగా, ఇటు టీమిండియాలో సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్ కారణంగా  శ్రేయాస్ అయ్యర్‌ స్థానంపై సరైన క్లారిటీ రాలేదు... ఈ ఏడాదైనా అయ్యర్ రాత మారుతుందేమో చూడాలి...

click me!