రాహుల్ ద్రావిడ్ కోసం రవిశాస్త్రిని తప్పించాల్సిన అవసరం లేదు... కపిల్‌దేవ్ కామెంట్...

Published : Jul 05, 2021, 03:39 PM IST

శ్రీలంక టూర్‌కి కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ వ్యవహరించడం, వచ్చే టీ20 వరల్డ్‌కప్ తర్వాత భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి కాంట్రాక్ట్ ముగుస్తుండడంతో టీమిండియా తర్వాతి కోచ్ ఎవరనే చర్చ నడుస్తోంది. ద్రావిడ్ టీమిండియా కోచ్‌గా వస్తాడంటూ టాక్ నడుస్తున్న సమయంలో మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు...

PREV
111
రాహుల్ ద్రావిడ్ కోసం రవిశాస్త్రిని తప్పించాల్సిన అవసరం లేదు... కపిల్‌దేవ్ కామెంట్...

అండర్-19, ఇండియా-ఏ జట్లకు కోచ్‌గా వ్యవహరించి అద్భుత విజయాలు అందించిన రాహుల్ ద్రావిడ్... ఎంతో మంది కుర్రాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆరంగ్రేటం చేసేందుకు కారణమయ్యాడు...

211

మరోవైపు అనిల్ కుంబ్లే రిటైర్మెంట్ తర్వాత భారత కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న రవిశాస్త్రి... నాలుగేళ్లుగా టీమిండియాకి చిరస్మరణీయ విజయాలను అందించాడు...

311

రవిశాస్త్రి కోచింగ్‌లో, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు రిజర్వు బెంచ్, అత్యంత పటిష్టంగా తయారైంది. ఒకేసారి రెండు జట్లతో రెండు భిన్నమైన టోర్నీలు ఆడేందుకు కూడా సిద్ధమైంది...

411

‘ఇప్పుడు భారత జట్టు బాగానే ఆడుతోంది. అయితే శ్రీలంక సిరీస్ కూడా ఇంకా పూర్తి కాలేదు. ఆ సిరీస్ ముగిసిన తర్వాత మనోళ్ల పర్ఫామెన్స్ చూసిన తర్వాత కానీ దీని గురించి మాట్లాడానికి అవకాశం దొరకదు...

511

భారత జట్టుకి ఓ కొత్త కోచ్ కావాలనుకుంటే అందులో ఎలాంటి తప్పూ లేదు. అయితే రవిశాస్త్రి కోచ్‌గా రాణిస్తున్నప్పుడు, అతన్ని కొనసాగించడంలో తప్పేం ఉంది...

611

జట్టు మంచిగా ఆడుతున్నప్పుడు కోచ్‌ను కానీ, లేదా కెప్టెన్‌నీ కానీ మారిస్తే ఆ టీమ్ ఒత్తిడిలో పడుతుంది... ప్లేయర్ల ఆటపై ఆ ప్రభావం పడుతుంది...

711

భారత జట్టుకి రిజర్వు బెంచ్ బలంగా కనిపిస్తోంది. ఇప్పుడు భారత జట్టు అద్భుతాలు చేయగలదు. అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తే అటు ఇంగ్లాండ్‌లో, ఇటు శ్రీలంకలోనూ విజయాలు అందుకోగలదు...

811

కుర్రాళ్లకు అవకాశం ఇవ్వడం చాలా మంచిది. అయితే టీమ్ మేనేజ్‌మెంట్ ఈ రెండు జట్లను ఎలా హ్యాండిల్ చేయాలో క్లారిటీతో వ్యవహరిస్తే బాగుంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు కపిల్‌దేవ్...

911

అయితే టీమిండియా ఫ్యాన్స్ మాత్రం రవిశాస్త్రి స్థానంలో రాహుల్ ద్రావిడ్‌ని కోచ్‌గా నియమించాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు...

1011

రవిశాస్త్రి కోచింగ్‌లో భారత జట్టు 2019 వన్డే వరల్డ్‌కప్, 2021 డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో ఓడింది. అదీకాకుండా టీమ్‌లో విరాట్ కోహ్లీ ఆధిక్య పెరిగిందని కామెంట్లు వినిపిస్తున్నారు.

1111

తాగుడుకి బాగా అలవాటు పడిన రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏం చెబితే దానికి తల ఊపుతున్నాడని... అందుకే జట్టు నిండా స్టార్లతో నిండిన టీమిండియా కీలక మ్యాచుల్లో ఫెయిల్ అవుతోందని ఆరోపిస్తున్నారు.

click me!

Recommended Stories