త్రిబుల్ సెంచరీ చేసిన కరణ్ నాయర్‌ను ఎందుకు పక్కనబెట్టేశారు... ఆ మ్యాచ్ తర్వాత...

First Published Jul 5, 2021, 3:05 PM IST

భారత క్రికెట్ చరిత్రలో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో త్రిబుల్ సెంచరీ సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్ కరణ్ నాయర్. అయితే ఆ రికార్డు ఫీట్ తర్వాత కరణ్ నాయర్‌కి జట్టులో చోటు దక్కలేదు. దీనిపై తాజాగా స్పందించాడు భారత మాజీ క్రికెటర్, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్...

2016లో తాను ఆడిన మూడో టెస్టులోనే ఇంగ్లాండ్‌పై త్రిబుల్ సెంచరీ సాధించాడు కర్ణాటక బ్యాట్స్‌మెన్ కరణ్ నాయర్. తొలి సెంచరీనే త్రిబుల్ సెంచరీగా మార్చిన మూడో క్రికెటర్ కరణ్..
undefined
టీమిండియా మాజీ క్రికెటర్, ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టీమిండియా తరుపున త్రిబుల్ సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు కరణ్ నాయర్...
undefined
అయితే ఆ తర్వాత మూడంటే మూడు మ్యాచులు ఆడిన కరణ్ నాయర్‌, ఆ మ్యాచుల్లో పెద్దగా ప్రభావం చూపించకపోవడంతో జట్టులో స్థానం కోల్పోయాడు...
undefined
‘కరణ్ నాయర్ లాంటి క్రికెటర్‌కి పెద్దగా అవకాశం రాకపోవడం నిజంగా దురదృష్టకరం. మిడిల్ ఆర్డర్‌లో అతను అద్భుతంగా రాణించగలడు...
undefined
ఫస్ట్ క్లాస్ కెరీర్‌ రికార్డులు గమనిస్తే, కరణ్ నాయర్ ఏం చేయగలడో అర్థమవుతుంది. త్రిబుల్ సెంచరీ తర్వాత రెండు, మూడు మ్యాచుల్లో ఫెయిల్ అవ్వడంతో అతన్ని పక్కనబెట్టేశారు...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్...
undefined
వరుసగా ఫెయిల్ అవుతున్నా, కొందరు క్రికెటర్లకు వరుస అవకాశాలు ఇస్తూ వస్తున్న భారత క్రికెట్ బోర్డు, కరణ్ నాయర్ లాంటి సత్తా ఉన్న బ్యాట్స్‌మెన్లను మాత్రం పట్టించుకోవడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి...
undefined
ఆఖరికి విజయ్ శంకర్, మనీశ్ పాండే వంటి ఏ మాత్రం ప్రభావం చూపని ప్లేయర్లకు జట్టులో స్థానం కల్పిస్తూ... త్రిబుల్ సెంచరీ సాధించిన ప్లేయర్‌కు మరో అవకాశం ఇవ్వకపోవడం అన్యాయమని కామెంట్లు చేస్తున్నారు...
undefined
టీమిండియా తరుపున 6 టెస్టు మ్యాచులు ఆడిన కరణ్ నాయర్, చెన్నైలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 303 పరుగులతో అజేయంగా నిలిచాడు...
undefined
76 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన కరణ్ నాయర్, 14 సెంచరీలతో 5436 పరుగులు చేశాడు. ఇందులో 2013-14 రంజీ సీజన్‌లో వరుసగా మూడు సెంచరీలు చేసిన కరణ్, ఫైనల్ మ్యాచ్‌లో 328 పరుగులు చేశాడు...
undefined
కరణ్ నాయర్ లాంటి ప్లేయర్ మరో దేశంలో కానీ పుట్టి ఉంటే, త్రిబుల్ సెంచరీ తర్వాత కనీసం 20-30 మ్యాచులైనా ఆడించేవాళ్లని... అందులో సగం ఛాన్సులు ఇచ్చినా ఈ కర్ణాటక బ్యాట్స్‌మెన్ తన సత్తా చాటుతాడని అంటున్నారు అభిమానులు...
undefined
click me!