హార్దిక్, బుమ్రాల‌కు షాక్.. నంబర్-1 బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్

First Published | Nov 14, 2024, 11:46 AM IST

Fast Bowler With Most Wickets : సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత్ 11 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తిల‌క్ వ‌ర్మ సెంచ‌రీతో అద‌ర‌గొట్ట‌గా, ఫాస్ట్ బౌల‌ర్ అర్ష్‌దీప్ సింగ్ అద్భుత బౌలింగ్ తో చ‌రిత్ర సృష్టించాడు. 
 

Arshdeep Singh

Fast Bowler With Most Wickets: సెంచూరియ‌న్ లో భార‌త్ అద్బుత విజ‌యం సాధించింది. ఈ విజ‌యంలో యంగ్ ప్లేయ‌ర్లు తిల‌క్ వ‌ర్మ‌, అభిషేక్ శ‌ర్మలు త‌మ బ్యాట్ తో కీల‌క పాత్ర పోషించాడు. వీరికి తోడుగా బౌలింగ్ లో అర్ష్ దీప్ సింగ్, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తిలో సూపర్ బౌలింగ్ తో అద‌ర‌గొట్టారు.

Arshdeep Singh

దక్షిణాఫ్రికాతో జరిగిన‌ మూడో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ చరిత్ర సృష్టించాడు. లెజెండ‌రీ బౌల‌ర్ల‌ను వెనక్కి నెడుతూ భారత్ తరఫున ఈ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్‌గా ఘ‌న‌త సాధించాడు .ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీశాడు. దీంతో ఈ రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్ లో అర్ష్ దీప్ సింగ్ పేరిట 92 వికెట్లు నమోదయ్యాయి.

Latest Videos


భార‌త స్టార్ల‌కు షాక్.. నంబర్-1 గా  అర్ష్‌దీప్ సింగ్ 

అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత ఫాస్ట్ బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ నిలిచాడు. అంతకు ముందు ఈ ఫార్మాట్‌లో 90 వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్ పేరిట ఈ రికార్డు ఉంది. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఒక వికెట్ తీసి భువేశ్వర్ కుమార్ రికార్డును సమం చేశాడు. ఆ తర్వాత చివరి ఓవర్లలో మరో రెండు వికెట్లు తీసి నంబర్-1 అయ్యాడు. ప్ర‌పంచ గొప్ప ఫాస్ట్ బౌల‌ర్ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతున్న జస్ప్రీత్ బుమ్రా  ఈ ఫార్మాట్‌లో ఇప్పటివరకు 89 వికెట్లు తీసి అర్ష్‌దీప్ సింత్ త‌ర్వాత ఉన్నాడు. 

భారత్ తరఫున అత్యధిక టీ20 అంతర్జాతీయ వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్లు వీరే 

అర్ష్ దీప్ సింగ్ - 92 వికెట్లు
భువనేశ్వర్ కుమార్ - 90 వికెట్లు
జస్ప్రీత్ బుమ్రా - 89 వికెట్లు
హార్దిక్ పాండ్యా - 88 వికెట్లు

మొత్తంగా టాప్ లో యుజ్వేంద్ర చాహల్

అర్ష్‌దీప్ T20 ఇంటర్నేషనల్‌లో భారతదేశం తరపున అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్‌గా కొన‌సాగుతున్నాడు. అయితే, మొత్తంగా ఈ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌల‌ర్ గా ఉన్నాడు.  96 వికెట్లు తీసిన భార‌త లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అగ్రస్థానంలో ఉన్నాడు. అలాగే, అర్ష్‌దీప్ సింగ్ చాహల్‌ను అధిగ‌మించాడు. చాహాల్ కంటే త‌క్కువ మ్యాచ్‌ల్లో భారత్ తరఫున అత్యధిక T20 అంతర్జాతీయ వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు.

arshdeepsinghh

భారత్ తరఫున అత్యధిక టీ20 అంతర్జాతీయ వికెట్లు తీసిన బౌలర్లు

యుజ్వేంద్ర చాహల్ - 96
అర్ష్‌దీప్ సింగ్ - 92
భువనేశ్వర్ కుమార్ - 90
జస్ప్రీత్ బుమ్రా - 89
హార్దిక్ పాండ్యా - 88

2022లో అరంగేట్రం చేసిన అర్ష్ దీప్ సింగ్ 

టీ20 అంత‌ర్జాతీయ క్రికెట్ లోకి లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్ దీప్ సింగ్ 2022లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. అయితే అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ స్టార్ బౌలర్ తన అద్భుతమైన బౌలింగ్ తో భార‌ టీ20 జట్టులో కొన‌సాగుతున్నాడు. అర్ష్‌దీప్‌ ఇప్పటివరకు 59 మ్యాచ్‌లు ఆడగా, అందులో 92 వికెట్లు పడగొట్టాడు. చాలా మ్యాచ్ లో భార‌త్ కు విన్నింగ్ ఇన్నింగ్స్ లు ఆడాడు.

click me!