Rohit Sharma: భారత్-ఆఫ్ఘనిస్తాన్ మూడో మ్యాచ్ లో గెలిచిన భారత్.. ఆఫ్ఘన్ ను వైట్ వాష్ చేసింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు సెంచరీతో టీమిండియాకు విజయం అందించాడు. టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో రోహిత్ రికార్డు స్థాయిలో ఐదో సెంచరీ సాధించిన తొలి ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు.
Rohit Sharma T20 Cricket: భారత్-ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ లోని మూడు మ్యాచ్ లలో గెలిచిన భారత్.. ఆఫ్ఘనిస్తాన్ ను చిత్తుచేసింది. ఉత్కంఠగా సాగిన మూడో, చివరి మ్యాచ్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ తో రోహిత్ శర్మ భారత్ కు విజయం అందించాడు.
27
భారత్-ఆఫ్ఘనిస్తాన్ మూడో మ్యాచ్ లో గెలిచిన భారత్ ఆఫ్ఘన్ ను వైట్ వాష్ చేసింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు సెంచరీతో టీమిండియాకు విజయం అందించాడు. టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో రోహిత్ రికార్డు స్థాయిలో ఐదో సెంచరీ సాధించిన తొలి ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు.
37
Rohit Sharma
ఈ మ్యాచ్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో ఐదో సెంచరీ సాధించాడు. 69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 121 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
47
Rohit Sharma
అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో ఐదు సెంచరీలు కొట్టిన తొలి ప్లేయర్ గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ సెంచరీతో రోహిత్ శర్మ టీ20ల్లో అత్యధిక సెంచరీల రేసులో ఉన్న సూర్యకుమార్ యాదవ్, ఆస్ట్రేలియాకు చెందిన గ్లెన్ మాక్స్‌వెల్‌లను అధిగమించాడు. సూర్య కుమార్ యాదవ్, మాక్స్‌వెల్ ఇద్దరూ నాలుగేసి సెంచరీలతో ఉన్నారు.
57
Rohit Sharma
అంతర్జాతీయ టీ20ల్లో టాప్ 5 సెంచరీలు
ఆటగాడు
మ్యాచ్‌లు
వందలు
పరుగులు
దేశం
రోహిత్ శర్మ
151
5
3874
భారతదేశం
గ్లెన్ మాక్స్‌వెల్
100
4
2275
ఆస్ట్రేలియా
సూర్యకుమార్ యాదవ్
60
4
2141
భారతదేశం
బాబర్ ఆజం
107
3
366
పాకిస్తాన్
కోలిన్ మున్రో
65
3
1724
న్యూజిలాండ్
67
Rohit Sharma and Rinku Singh
ఇక టెస్టులు, వన్డేలు, టీ20 క్రికెట్ లో అత్యధిక సెంచరీలు కొట్టిన ప్లేయర్ల లిస్టులో భారత ప్లేయర్లు టాప్ లో ఉన్నారు. టెస్టులలో సచిన్ టెండూల్కర్, వన్డేలలో విరాట్ కోహ్లీ, టీ20ల్లో రోహిత్ శర్మలు అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో టాప్ లో ఉన్నారు.