నా బౌలింగ్‌లో ఆడాలంటే అందరూ భయపడ్డారు, అతనొక్కడే మాత్రం నన్ను భయపెట్టాడు...

Published : Aug 20, 2022, 05:00 PM IST

సచిన్ టెండూల్కర్... వరల్డ్ క్లాస్ బౌలర్లను ఎదుర్కొంటూ సెంచరీల మోత మోగించిన లెజెండరీ క్రికెటర్. ముత్తయ్య మురళీధరన్, బ్రెట్ లీ, షేన్ వార్న్, గ్లెన్ మెక్‌గ్రాత్‌తో పాటు షోయబ్ అక్తర్ బౌలింగ్‌లోనూ పరుగుల వరద పారించాడు సచిన్ టెండూల్కర్. మాస్టర్ బ్యాటింగ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్...

PREV
18
నా బౌలింగ్‌లో ఆడాలంటే అందరూ భయపడ్డారు, అతనొక్కడే మాత్రం నన్ను భయపెట్టాడు...

1999 వన్డే వరల్డ్ కప్‌లో టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చాడు పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్. 10 మ్యాచుల్లో 4.83 ఎకానమీతో 16 వికెట్లు పడగొట్టాడు... ఆ టోర్నీలో సక్లైన్ ముస్తాక్ తర్వాత పాక్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు అక్తర్...

28

‘ఇండియాతో మ్యాచ్‌ అంటే పాకిస్తాన్‌ జట్టు తీవ్రమైన ఒత్తిడితో బరిలో దిగుతుంది. 2003 వన్డే వరల్డ్ కప్‌లో మేం టీమిండియా చేతుల్లో ఓడిపోయాం. అయితే 1999 వన్డే వరల్డ్ కప్‌లో సచిన్ టెండూల్కర్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం నేను ఎప్పటికీ మరిచిపోను...

38

ఎందుకంటే ఆ టైమ్‌లో నా బౌలింగ్ ఫేస్ చేయడానికి మిగిలిన బ్యాటర్లు అందరూ భయపడేవాళ్లు. అప్పుడు వరల్డ్ టాప్ క్లాస్ బ్యాటర్లు కూడా నా బౌలింగ్‌లో క్రీజు వదిలి ముందుకి వచ్చేవాళ్లు కాదు.. నా బౌలింగ్ వారిని అంతలా వణికించేది...

48

అయితే సచిన్ టెండూల్కర్ మాత్రం అస్సలు భయపడేవాడు కాదు. అతను బౌలర్లకు ఏ మాత్రం గౌరవం ఇవ్వడు. నా బౌలింగ్‌లో చాలా స్వేచ్ఛగా ఫ్రంట్ ఫుట్ వచ్చి బౌండరీలు బాదేవాడు. అది చూసి నేను తట్టుకోలేకపోయేవాడు...

58

పాకిస్తాన్‌ టీమ్‌, ఇండియాతో మ్యాచ్ ఆడితే దాన్ని ఓ సాధారణ మ్యాచ్‌లా ఎందుకు చూడరు? 1999 వన్డే వరల్డ్ కప్‌కి ముందు కూడా మేం ఇండియాని వన్డే సిరీస్‌లో, టెస్టుల్లో ఓడించాం. అయితే వరల్డ్ కప్‌లో మాత్రం తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాం...

68

దీనికి ప్రధాన కారణం మీడియా చేసే రచ్చ. పాకిస్తాన్ టీమ్‌పై తీవ్రమైన హైప్ తెచ్చేవాళ్లు. మేం టీవీ చూస్తూ ఆ హైప్‌ని నరనరాన ఎక్కించుకునేవాళ్లం. అది మమ్మల్ని ఒత్తిడిలోకి పడేసేది... ’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్.. 

78

1999 వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 పరుగుల తేడాతో విజయం అందుకుంది భారత జట్టు. ఈ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ 45 పరుగులు చేయగా రాహుల్ ద్రావిడ్ 61, కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ 59 పరుగులు చేయడంతో 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది భారత్...

88

228 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన పాకిస్తాన్, 45.3 ఓవర్లలో 180 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఇంజమామ్ వుల్ హక్ 41, సయ్యద్ అన్వర్ 36 పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో వెంకటేశ్ ప్రసాద్ 5 వికెట్లు తీయగా జవగళ్ శ్రీనాథ్ 3, అనిల్ కుంబ్లే 2 వికెట్లు పడగొట్టి పాక్ పతనాన్ని శాసించారు.. 

click me!

Recommended Stories