జింబాబ్వేపైన కూడా ఇంత భయమైతే ఎలా రాహులా... బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసమొచ్చి, టాస్ గెలిచినా...

Published : Aug 20, 2022, 03:34 PM ISTUpdated : Aug 20, 2022, 03:35 PM IST

కెఎల్ రాహుల్... బ్యాట్స్‌మెన్‌గా నిలకడైన ప్రదర్శన ఇస్తూ, వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ కొట్టేశారు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా పెద్దగా సక్సెస్ కాకపోయినా, టీమిండియా తరుపున బ్యాటుతో నిలకడైన పర్ఫామెన్స్ ఇస్తున్న కెఎల్ రాహుల్‌ని ఫ్యూచర్ కెప్టెన్‌గానే చూస్తోంది బీసీసీఐ...  

PREV
18
జింబాబ్వేపైన కూడా ఇంత భయమైతే ఎలా రాహులా... బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసమొచ్చి, టాస్ గెలిచినా...

సౌతాఫ్రికా టూర్‌లో కెప్టెన్‌గా వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడి, చెత్త రికార్డు మూటకట్టుకున్న కెఎల్ రాహుల్, జింబాబ్వే టూర్‌లో తొలి విజయాన్ని అందుకున్నాడు. మొదటి వన్డేలో భారత జట్టు, పసికూన జింబాబ్వేపై 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది...

28
KL Rahul

తొలి వన్డేలో జింబాబ్వే ఆటతీరు చూసిన తర్వాత కూడా రెండో వన్డేలో టాస్ గెలిచిన తర్వాత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు కెఎల్ రాహుల్. ఈ నిర్ణయం కెఎల్ రాహుల్‌ కెప్టెన్సీపై మరోసారి విమర్శలు రావడానికి కారణమైంది...

38

తొలుత జింబాబ్వే టూర్‌కి కెప్టెన్‌గా శిఖర్ ధావన్‌ని ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే గాయం నుంచి కోలుకుని, కరోనా నుంచి బయటపడిన కెఎల్ రాహుల్‌కి తగినంత ప్రాక్టీస్ ఉంటుందనే ఉద్దేశంతో ఆదరాబాదరాగా జింబాబ్వేకి పంపించింది...

48

బ్యాటింగ్ ప్రాక్టీస్ కావాలంటే తొలుత బ్యాటింగ్ చేయాలి. 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తే కెఎల్ రాహుల్‌తో పాటు అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ వంటి ప్లేయర్లందరికీ ఛాన్స్ వస్తుంది...  అయితే రాహుల్ మాత్రం అలా ఆలోచించలేదు...

58

టాస్ గెలిచిన వెంటనే మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీని వల్ల బౌలర్లకు తగిన ప్రాక్టీస్ దక్కొచ్చు కానీ బ్యాటర్లకు పూర్తి 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసే అవకాశం రాదు. తొలి వన్డేలో జింబాబ్వే విధించిన 190 పరుగుల లక్ష్యాన్ని... ఓపెనర్లు శిఖర్ ధావన్, శుబ్‌మన్ గిల్ కలిసి ఊదిపడేశారు. దీంతో కెఎల్ రాహుల్ బ్యాటింగ్‌కే రాలేదు...

68

జింబాబ్వే టూర్‌కి ఎంపికైన ప్లేయర్లలో చాలామందికి ఆసియా కప్ 2022 టోర్నీలో చోటు దక్కలేదు. ఆవేశ్ ఖాన్, దీపక్ హుడా, కెఎల్ రాహుల్ మాత్రమే ఆసియా కప్ ప్రధాన జట్టులో ఉంటే స్టాండ్ బౌ ప్లేయర్లుగా అక్షర్ పటేల్, దీపక్ చాహార్‌లకు అవకాశం దక్కింది...

78

అలాంటప్పుడు బ్యాటింగ్ ప్రాక్టీస్ ఉండేలా చూసుకోవాల్సిందిపోయి... గెలుపే ప్రధానంగా జింబాబ్వేపై కూడా తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. అసలే వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లను జనాలు పెద్దగా పట్టించుకోలేదు...

88

జింబాబ్వేతో జరిగిన మొదటి వన్డే పూర్తి వన్‌సైడెడ్‌గా జరిగి, చప్పగా ముగిసింది. కనీసం రెండో వన్డేలో అయినా టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేసి ఉంటే... కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్ వంటి ప్లేయర్లు సెంచరీలు చేస్తే చూద్దామనుకున్న క్రికెట్ ఫ్యాన్స్‌ని తీవ్రంగా డిస్సప్పాయింట్ చేశాడు ఈ తాత్కాలిక కెప్టెన్... 

click me!

Recommended Stories