టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో సంచలన ప్రదర్శన ఇచ్చాడు షాహీన్ ఆఫ్రిదీ. ఇన్నింగ్స్ తొలి బంతికే రోహిత్ శర్మను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన షాహీన్ ఆఫ్రిదీ, ఆ తర్వాతి ఓవర్‌లో కెఎల్ రాహుల్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు... ఆ తర్వాత హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ కూడా షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు.