అతన్ని చూశాకే రిటైర్ అయ్యా! అమీర్ ముందు షాహీన్ పిల్ల బచ్చా... - షోయబ్ అక్తర్

First Published Jan 6, 2023, 4:51 PM IST

పాకిస్తాన్ క్రికెట్ టీమ్ అంటే అందరికీ గుర్తుకువచ్చేది ఫాస్ట్ బౌలింగే. వసీం అక్రమ్, ఇమ్రాన్ ఖాన్, షోయబ్ అక్తర్ వంటి దిగ్గజ ఫాస్ట్ బౌలర్లను ప్రపంచానికి పరిచయం చేసిన పాక్‌లో ఇప్పుడు షాహీన్ షా ఆఫ్రిదీ స్టార్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అమీర్ ముందు షాహీన్ పిల్ల బచ్చా అంటున్నాడు పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్...

shaheen

కెరీర్ పీక్ స్టేజీలో ఉన్న సమయంలో పీసీబీతో గొడవ పడి, అర్ధాంతరంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్. ఛాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్‌లో భారత జట్టు పరాజయానికి ప్రధాన కారణం అమీర్...

రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీలను వెంటవెంటనే అవుట్ చేసిన మహమ్మద్ అమీర్, పీసీబీతో గొడవ పడి 29 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ తీసుకున్నాడు. 

Mohammad Amir

 పాక్ తరుపున 36 టెస్టులు, 61 వన్డేలు, 50 టీ20 మ్యాచులు ఆడాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో కొంతకాలం క్రికెట్‌కి దూరమై రీఎంట్రీ ఇచ్చిన అమీర్, పాకిస్థాన్ తరుపున మొత్తంగా 259 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు.

పీసీబీ అధ్యక్షుడు రమీజ్ రాజాతో విభేదాలతో రిటైర్మెంట్ తీసుకున్న మహమ్మద్ అమీర్, అతను ఆ పొజిషన్ నుంచి తప్పుకున్నాక రీఎంట్రీ ఇస్తానని ప్రకటించాడు. రమీజ్ రాజాని పీసీబీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది పాక్ క్రికెట్ బోర్డు. అతని స్థానంలో నజమ్ సేథి బాధ్యతలు తీసుకున్నాడు...

‘మహ్మద్ అమీర్ రీఎంట్రీ ఇస్తే పాకిస్తాన్‌ క్రికెట్‌కి ఎంతో మేలు జరుగుతుంది. అతనికి ఇంకా చాలా కెరీర్ ఉంది. షాహీన్ కంటే మహ్మద్ అమీర్‌లో టాలెంట్ చాలా ఉంది. 2007లో రావల్పిండిలో అమీర్‌ని చూశాకే రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నా...

నా స్థానాన్నీ భర్తీ చేయగల సత్తా ఉన్న ప్లేయర్‌గా మహమ్మద్ అమీర్. ఇప్పుడు అతనికి సమయం వచ్చింది. అమీర్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కున్నాక నేను రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని అనుకున్నా. ఎందుకంటే జట్టుకి నా అవసరం ఉందని అనిపించింది...

మహమ్మద్ అమీర్, పాక్ టీమ్‌లో రీఎంట్రీ ఇస్తే షాహీన్‌తో కలిసి బౌలింగ్ చేస్తే బాగుంటుంది. అమీర్, షాహీన్, హారీస్ రౌఫ్, నసీం షా కలిస్తే పాక్ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్, ప్రపంచంలో టాప్ క్లాస్‌గా మారుతుంది...’ అంటూ వ్యాఖ్యానించాడు పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్.. 

click me!