నిన్ను చూశాకే క్రికెట్ ఆడడం మొదలెట్టా... కపిల్‌దేవ్‌కి సచిన్ టెండూల్కర్ బర్త్ డే విషెస్...

First Published Jan 6, 2023, 11:53 AM IST

టీమిండియాకి మొట్టమొదటి వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ కపిల్‌ దేవ్. హాకీ క్రేజ్‌లో మునిగితేలుతున్న భారత జనాలకు క్రికెట్‌పై అమితమైన ఇష్టాన్ని తెచ్చిపెట్టింది ఈ విజయమే. 1983 వన్డే వరల్డ్ కప్ తర్వాత భారత క్రికెట్‌ స్థాయి వంద వేల రెట్లు పెరిగిపోయింది...

అతి పిన్న వయసులో వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిన కపిల్ దేవ్, టెస్టుల్లో 4 వేల పరుగులు, 400+ వికెట్లు తీసిన ఏకైక భారత క్రికెటర్‌గానూ నిలిచాడు... ఆరో స్థానంలో అత్యధిక స్కోరు బాదిన ప్లేయర్ కూడా కపిల్ దేవే...

1983 వన్డే వరల్డ్ కప్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన కపిల్ దేవ్ 138 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్లతో 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో భారత మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ 25+ స్కోరు కూడా చేయకపోవడం విశేషం...
 

క్రికెట్ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్‌గా చెప్పుకునే కపిల్ దేవ్ 175 పరుగుల ఇన్నింగ్స్‌కి సంబంధించిన వీడియో ఫుటేజీ మాత్రం అందుబాటులో లేదు. కారణం ఈ మ్యాచ్ సమయంలో బ్రాడ్ కాస్టర్లు స్ట్రైయిక్ చేయడంతో వీడియో రికార్డు జరగలేదు.. 

కపిల్ దేవ్‌కి తన స్టైల్‌లో బర్త్ డే విషెస్ తెలిపాడు భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. ‘కపిల్ దేవ్ 1983 వన్డే వరల్డ్ కప్ లిఫ్ట్ చేయడం చూసిన ఓ 10 ఏళ్ల కుర్రాడు, తాను కూడా ఇండియా కోసం మరో వరల్డ్ కప్ గెలవాలని కల కన్నాడు.

అప్పటి నుంచి క్రికెట్‌ని ఇంకా ఎక్కువగా ప్రేమించడం మొదలెట్టాడు. ఆ కుర్రాడిని నేనే. హ్యాపీ బర్త్ డే కపిల్ పాజీ.. నువ్వు ఇలాగే కోట్ల మందిలో స్ఫూర్తి నింపుతూ ఉండాలి...’ అంటూ ట్వీట్ చేశాడు సచిన్ టెండూల్కర్...

1983 వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఆరేళ్లకు 1989లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు సచిన్ టెండూల్కర్. రికార్డు స్థాయిలో 6 వన్డే వరల్డ్ కప్స్ ఆడిన సచిన్ టెండూల్కర్, 2003 వన్డే వరల్డ్ కప్‌లో 673 పరుగులు చేసి మరో రికార్డు క్రియేట్ చేశాడు.. 

Sachin Tendulkar

2003 వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ మ్యాచ్‌లో ఓడిన భారత జట్టు, 2011 వన్డే వరల్డ్ కప్‌లో టైటిల్ కైవసం చేసుకుంది. వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కొన్నాళ్లకు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు సచిన్ టెండూల్కర్...

click me!