మా బౌలర్లకీ, భారత బౌలర్లకీ ఆ ఒక్కటే తేడా! అందుకే వాళ్లు అక్కడ సక్సెస్ కావడం లేదు... షోయబ్ అక్తర్ కామెంట్స్...

First Published Jan 31, 2022, 1:58 PM IST

ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో టాప్ క్లాస్ బౌలింగ్ యూనిట్ కలిగిన జట్టు ఏదంటే అది టీమిండియానే. జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ... వంటి బౌలర్లతో కూడిన టీమిండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలలో అద్భుత విజయాలు అందుకుంది. అయితే టీమిండియా కంటే తమ బౌలింగ్ యూనిట్ చాలా స్ట్రాంగ్ అంటున్నాడు పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్...

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీలో భారత బౌలర్లు చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయారు. ఇంగ్లాండ్ టూర్ ముగిసిన తర్వాత ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌లో పాల్గొని వరల్డ్‌కప్ టోర్నీలో పాల్గొనడంతో అలసిపోయినట్టు కనిపించారు...

ప్రాక్టీస్ మ్యాచుల్లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన భారత జట్టు, తీరా టోర్నీ మొదలయ్యాక తేలిపోయింది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన భారత బౌలర్లు, ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగారు...

పాక్ యంగ్ సెన్సేషనల్ పేసర్ షాహీన్ ఆఫ్రిదీ, నిప్పులు చెదిరే బంతులతో భారత టాపార్డర్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్‌లను స్వల్ప స్కోర్లకే అవుట్ చేసిన పిచ్‌పై భారత బౌలర్లు భువీ, బుమ్రా, షమీ వికెట్ తీయడం కాదు కదా, అసలు పాక్ ఓపెనర్లను ఇబ్బంది పెట్టలేకపోయారు...

‘భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. భారత జట్టు కూడా మంచి ఫాస్ట్ బౌలర్లను తయారుచేస్తోంది. అయితే పాక్ బౌలర్లతో పోలిస్తే భారత బౌలర్లలో రేర్ ఎనర్జీ ఉండదు...

పాక్ బౌలర్ల ముఖంలో కోపం, బ్యాట్స్‌మెన్‌ను చంపేయాలనేంత కసి, యాటిట్యూడ్ క్లియర్‌గా కనిపిస్తాయి.. దానికి కారణం కూడా పాక్ జట్టుకి మొదటి నుంచి ఉన్న బలమైన ఫాస్ట్ బౌలింగ్ యూనిటే...

మా ముందు తరం వాళ్లు ఇలాంటి యాటిట్యూడ్, కసి ముఖంలో చూపించేవాళ్లు. మేం కూడా అదే తిండి, అదే వాతావరణం, అలాంటి పరిస్థితుల్లో పెరగడం వల్ల అలాంటి యాటిట్యూడ్‌నే అలవరుచుకుంటున్నాం...

నాలాంటి బౌలింగ్ వేసే సమయంలో మరో విషయం గురించి ఆలోచించం. బ్యాట్స్‌మెన్‌ను చంపైనా, వికెట్ తీయడమే మాకున్న ఏకైక టార్గెట్. ఇలాంటి యాటిట్యూడ్, మరింత వేగంగా బంతులు వేసేందుకు కావాల్సిన ఎనర్జీని ఇస్తుంది..

అంతేకాకుండా మేం ఎక్కువగా మాంసాహారం తింటాం. అందుకే మేం కూడా పశువుల్లాగే ప్రవర్తిస్తాం... ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే, మేం సింహాల్లా పరుగెడతాం... ’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్...

పాక్ బౌలర్లలో ఒక్క వసీం అక్రమ్ మాత్రమే 400+ వికెట్లు తీశాడు. అదే భారత జట్టు విషయానికి వస్తే అనిల్ కుంబ్లే 619, కపిల్ దేవ్, రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్‌ల రూపంలో నలుగురు 400+ వికెట్లు తీశారు...

అంతేకాకుండా గత ఏడాది భారత స్పిన్నర్ 9 మ్యాచుల్లో 54 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిస్తే, పాక్ బౌలర్లు షాహీన్ ఆఫ్రిదీ 47, హసన్ ఆలీ 41 వికెట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు...

గొర్రెలను తింటాం, సింహాల్లా గుంట నక్కల్లా పరుగెడతాం అని చెప్పే బదులు... కాస్త మనుషుల్లా ప్రవర్తించడం ఎలాగో నేర్చుకుంటే బాగుపడతారంటూ షోయబ్ అక్తర్‌కి కామెంట్లతో సమాధానం చెబుతన్నారు టీమిండియా ఫ్యాన్స్...

click me!