ఐపీఎల్ సమయంలో విరాట్‌తో మాట్లాడాను, అంతలోనే ఇలా... రోహిత్ శర్మకు అంత ఈజీ కాదు...

Published : Jan 31, 2022, 01:51 PM IST

టెస్టుల్లో అత్యంత విజయవంతమైన భారత సారథిగా నిలిచిన విరాట్ కోహ్లీ, అర్ధాంతరంగా టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్. ఐపీఎల్ 2021 సమయంలో విరాట్‌తో మాట్లాడిన సంభాషణను గుర్తు చేసుకున్నాడు...

PREV
110
ఐపీఎల్ సమయంలో విరాట్‌తో మాట్లాడాను, అంతలోనే ఇలా... రోహిత్ శర్మకు అంత ఈజీ కాదు...

సెంచూరియన్ టెస్టులో విజయంతో 40 టెస్టు విజయాలతో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఆల్‌టైం టెస్టు కెప్టెన్లలో ఒకడిగా టాప్ 4లో నిలిచిన విరాట్ కోహ్లీ, టాప్ 3లో నిలిచేందుకు ఒకే ఒక్క విజయం దూరంలో టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు...

210

కేప్ టౌన్ టెస్టు మ్యాచ్ ఓటమి తర్వాత ఏడేళ్లుగా మోస్టున్న టెస్టు కెప్టెన్సీ పొజిషన్‌కి గుడ్‌ బై చెబుతున్నట్టు ప్రకటించి, అందర్నీ అవాక్కయ్యేలా చేశాడు భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ...

310

‘విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం నాక్కూడా సర్‌ప్రైజింగ్‌గానే అనిపించింది. ఎందుకంటే ఐపీఎల్ 2021 ఫస్ట్ ఫేజ్ (కరోనా కేసుల కారణంగా వాయిదా పడకముందు) సమయంలో నేను, విరాట్‌తో కలిసి చాలా సేపు మాట్లాడాను...

410

ఆ సమయంలోనే తాను వైట్ బాల్ క్రికెట్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు విరాట్ కోహ్లీ నాతో చెప్పాడు. అయితే టెస్టు కెప్టెన్‌గా మాత్రం మరికొన్నేళ్లు కొనసాగుతానని అన్నాడు...

510

టెస్టుల్లో జట్టును నడిపించడం విరాట్ కోహ్లీకి చాలా ఇష్టం. ఆ పనిని ఓ బాధ్యతగా కాకుండా ఎంతో ఎంజాయ్ చేస్తూ చేస్తాడు విరాట్. అందుకే కోహ్ల టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడని వినగానే కొంచెం ఆశ్చర్యపోయాను...

610

విరాట్ కోహ్లీ ఆటను ఓ గంట సేపు చూస్తే చాలు, అతను గేమ్‌ను ఎంతగా ఎంజాయ్ చేస్తాడో అర్థం చేసుకోవచ్చు. విదేశాల్లో విజయాలు లేని సమయంలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు అద్భుతాలు చేసింది...

710

మరో రకంగా చెప్పాలంటే టెస్టు క్రికెట్‌కి ఈరోజుల్లో ఇంతటి ఆదరణ రావడానికి విరాట్ కోహ్లీ కెప్టెన్సీయే కారణం. అతను టీమిండియా టాప్ క్లాస్ టెస్టు టీమ్‌గా తయారుచేశాడు...

810

విరాట్ కోహ్లీ తర్వాత ఆ బాధ్యతలు తీసుకోవడానికి రోహిత్ శర్మ అన్ని విధాల అర్హుడు. అందులో ఎలాంటి సందేహం లేదు, అయితే విరాట్ కోహ్లీ పొజిషన్‌ను భర్తీచేయడం అంత సులువైన విషయం కాదు...

910

ఎందుకంటే ప్రపంచంలో కెప్టెన్‌గా ఉండడానికి క్లిష్టమైన జట్టు ఏదైనా ఉందంటే అది భారత జట్టే. 120 కోట్ల మంది ప్రేమించే ఆటను లీడ్ చేయడం అంత తేలికైన విషయం కాదు... 

1010

విరాట్ కోహ్లీకి ఇప్పటికి 33 ఏళ్లు మాత్రమే. అతను మరికొన్నేళ్లు క్రికెటర్‌గా కొనసాగేందుకు అవకాశం ఉంది. అతను బ్యాటుతో మరికొన్ని రికార్డులు బ్రేక్ చేస్తాడనే నమ్మకం నాకుంది...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్... 

Read more Photos on
click me!

Recommended Stories