బద్దకానికి బలైన విండీస్ హిట్టర్.. ఫ్లైట్ మిస్ అయి టీ20 ప్రపంచకప్‌కు దూరం

First Published Oct 4, 2022, 7:21 PM IST

Shimron Hetmeyer: ప్రపంచకప్  ముందు వెస్టిండీస్   క్రికెట్ బోర్డు  ఆ జట్టు స్టార్ బ్యాటర్ షిమ్రన్ హెట్మెయిర్ పై క్రమశిక్షణాచర్యలకు దిగింది. దీంతో అతడు ఏకంగా  టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 

టీ20 ప్రపంచకప్ కు ముందు విండీస్ క్రికెట్ బోర్డు ఆ జట్టు  స్టార్ ఆటగాడు  షిమ్రన్ హెట్మెయిర్ పై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. ప్రపంచకప్ లో  నష్టపోతామని తెలిసినా  నిబంధనలను ఉల్లంఘిస్తే శిక్షలు కఠినంగా  ఉంటాయని చెప్పకనే చెప్పింది. 

అసలు విషయానికొస్తే.. టీ20 ప్రపంచకప్ కు ఎంపిక చేసిన వెస్టిండీస్ జట్టులో  ఏ క్షణాల్లోఅయినా మ్యాచ్ ను మలుపుతిప్పే  విధ్వంసకర ఆటగాడు షిమ్రన్ హెట్మెయిర్  కు షాకిచ్చింది. రెండుసార్లు ఫ్లైట్ మిస్ అయినందుకు గాను అతడిని 15 మంది సభ్యుల జాబితా నుంచి అతడి తొలగిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. అతడి స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేసింది. 

కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) లో భాగంగా  హెట్మెయిర్.. గయానా అమెజాన్ వారియర్స్ కు సారథ్యం వహించాడు. ఈ జట్టు సీపీఎల్-2022 ఫైనల్ కు చేరింది. ఫైనల్ చేరిన గయానా జట్టులోని ఆటగాళ్లు.. అక్టోబర్ 1న ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు అనుమతినిచ్చారు. టీ20 ప్రపంచకప్ కు ఎంపికైన  పలువురు సభ్యులు  అంతకుముందే ఆసీస్ కు పయనమయ్యారు. 

టీ20 ప్రపంచకప్ కు ముందు ఆస్ట్రేలియాతో  వెస్టిండీస్ రెండు టీ20లు ఆడాల్సి ఉంది. అక్టోబర్ 5, 7 వ  తేదీలలో రెండు టీ20లు జరుగుతాయి.  ఈ నేపథ్యంలో  విండీస్ జట్టులోని పలువురు సభ్యులు ముందుగానే అక్కడికి వెళ్లారు. కానీ సీపీఎల్ ఫైనల్ చేరిన జట్లలోని ఉన్న ఆటగాళ్లు  అక్టోబర్ 1న వెళ్లడానికి అక్కడి బోర్డు షెడ్యూల్ చేసింది. కానీ  షిమ్రన్.. వ్యక్తిగత కారణాల వల్ల  తాను అక్టోబర్ 3న ఆసీస్  విమానమెక్కుతానని బోర్డుకు విన్నవించుకున్నాడు. 

అతడి అభ్యర్థనను మన్నించిన  బోర్డు  అందుకు అంగీకారం తెలిపింది. రీషెడ్యూల్ ఫైట్ టికెట్ 3న వేయించింది. కానీ   షిమ్రన్  సోమవారం కూడా ఎయిర్ పోర్టుకు వెళ్లలేదు. ఫ్లైట్ మిస్ అయిన అనంతరం షిమ్రన్ బోర్డుతో. ‘కొన్ని కారణాల వల్ల ఫ్లైట్ మిస్ అయ్యాను. సారీ ఫర్ డిలే..’ అని బోర్డుకు తెలిపాడు. 

కానీ విండీస్ బోర్డు మాత్రం  హెట్మెయిర్ పై క్రమశిక్షణ చర్యలకు దిగింది. ఈ విషయంలో విండీస్  క్రికెట్ బోర్డు డైరెక్టర్  జిమ్మీ ఆడమ్స్ మాట్లాడుతూ.. ‘హెట్మెయిర్ విషయంలో మేం క్లారిటీగా ఉన్నాం. ఫ్లైట్ రీషెడ్యూల్ చేసినా అతడు సరైన సమయానికి రాలేకపోయాడు. అలా చేస్తే జట్టు నుంచి తప్పిస్తామని ముందే హెచ్చరించాం. అయినా అతడు మరోసారి ఫ్లైట్ మిస్ అయ్యాడు. దీంతో నిబంధనల ప్రకారం అతడిని తప్పించి షమ్రా బ్రూక్స్ ను  జట్టులోకి రిప్లేస్ చేశాం..’ అని పేర్కొన్నాడు.

click me!