ఆ వీక్‌నెస్‌పైన ఫోకస్ పెట్టిన టీమిండియా... జహీర్ ఖాన్ ప్లేస్‌ని భర్తీ చేసే బౌలర్ ఎవరవుతారు?...

First Published Oct 3, 2022, 7:02 PM IST

టీమిండియాలో రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లు ఉన్నారు. అయితే వీళ్లందరికీ ఉన్న వీక్‌నెస్ లెఫ్ట్ ఆర్మీ పేసర్‌ బౌలింగ్‌ని ఫేస్ చేయలేకపోవడం. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో షాహీన్ ఆఫ్రిదీ, ఆ తర్వాత ట్రెంట్ బౌల్ట్, దానికి ముందు రీస్ టోప్లే... ఇలా లెఫ్ట్ ఆర్మీ పేసర్ బౌలింగ్‌కి వస్తే చాలు, టీమిండియా వికెట్లు టపాటాపా పడిపోతాయి...

భారత బ్యాటర్లు లెఫ్ట్ ఆర్మీ పేసర్‌ని ఎదుర్కోవడానికి తెగ ఇబ్బందిపడడానికి ప్రధాన కారణం భారత జట్టులో సరైన లెఫ్ట్ ఆర్మీ పేసర్ లేకపోవడమే. జహీర్ ఖాన్ రిటైర్మెంట్ తర్వాత ఆ స్థాయిలో మరో లెఫ్ట్ ఆర్మీ పేసర్‌ని తయారుచేయలేకపోయింది భారత జట్టు...

arshdeep

ఇర్ఫాన్ పఠాన్ కొన్నాళ్లు ఆశలు రేపినా ఆ తర్వాత సరైన అవకాశాలు అందిపుచ్చుకోలేకపోయాడు. దీంతో కొన్నాళ్లుగా సరైన లెఫ్ట్ ఆర్మీ బౌలర్ లేకుండానే ఆడుతున్న భారత జట్టుకి అర్ష్‌దీప్ సింగ్ రూపంలో ఓ ఆశాకిరణం కనిపించింది...

అర్ష్‌దీప్ సింగ్‌ ఒక్కడిపైనే ఆధారపడడం కరెక్ట్ కాదని గ్రహించిన భారత జట్టు మేనేజ్‌మెంట్, మరో ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ పేసర్లను తయారుచేయడంపై ఫోకస్ పెట్టింది. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కి ఎంపికైన జట్టులో ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ పేసర్లు ఉండడం విశేషం...

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ తరుపున ఆరంగ్రేటం చేసి అదరగొట్టిన ఛేతన్ సకారియా, 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడాడు. ప్రస్తుతం ఇరానీ ట్రోఫీ 2022లో సౌరాష్ట్ర తరుపున ఆడిన ఛేతన్ సకారియా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు...

ఛేతన్ సకారియాతో పాటు ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి కీలక బౌలర్‌గా మారిన ముకేష్ కుమార్ చౌదరికి సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో చోటు దక్కింది. ఐపీఎల్ 2022 సీజన్‌లో 13 మ్యాచుల్లో 16 వికెట్లు తీసిన ముకేష్ చౌదరి, ఇరానీ ట్రోఫీలో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు తరుపున తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశాడు...

ముకేశ్ చౌదరి, ఛేతన్ సకారియా, అర్ష్‌దీప్ సింగ్‌లలో టీమిండియాకి ఎవరు జహీర్ ఖాన్‌లా మారతారో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. ఛేతన్ సకారియా, అర్ష్‌దీప్ సింగ్ ఇప్పటికే టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేయగా ముకేశ్ చౌదరికి ఇదే తొలి పిలుపు... 

click me!