విరాట్ కోహ్లీ, రోహిత్, సూర్యలకు రెస్ట్!... సౌతాఫ్రికాతో మూడో టీ20లో టీమిండియా ప్రయోగాలు...

Published : Oct 03, 2022, 04:06 PM IST

సౌతాఫ్రికాపై వరుసగా రెండు టీ20 మ్యాచుల్లో గెలిచి 2-0 తేడాతో సిరీస్ సొంతం చేసుకున్న భారత జట్టు, మంగళవారం ఇండోర్‌లో మూడో టీ20 మ్యాచ్ ఆడనుంది. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు భారత జట్టు ఆడబోయే ఆఖరి టీ20 మ్యాచ్ ఇదే...

PREV
18
విరాట్ కోహ్లీ, రోహిత్, సూర్యలకు రెస్ట్!... సౌతాఫ్రికాతో మూడో టీ20లో టీమిండియా ప్రయోగాలు...

సౌతాఫ్రికా సిరీస్ ముగిసిన తర్వాత టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడే భారత జట్టు సభ్యులందరూ అక్టోబర్ 5న పెర్త్ బయలుదేరి వెళ్తారు. శిఖర్ ధావన్ కెప్టెన్సీలో మరో టీమ్, సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడుతుంది... 

28

దీంతో ప్రయాణానికి ముందు రోజు మ్యాచ్‌కి కీలక ప్లేయర్లు దూరంగా ఉండబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భారత జట్టు, ఇండోర్‌లో జరిగే చివరి మ్యాచ్‌లో కీలక ప్లేయర్లకు రెస్ట్ ఇవ్వాలని భావిస్తోందట...

38
Image credit: PTI

అదిరిపోయే ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్‌ని ఇక నేరుగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో బరిలో దింపాలని చూస్తున్నట్టు కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా ప్రకటించాడు. దీంతో మూడో టీ20లో యాదవ్ ఆడడం అనుమానమే...

48

అలాగే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఇండోర్ టీ20లో ఆడడం లేదు. ఆసియా కప్ 2022 నుంచి వరుసగా మ్యాచులు ఆడుతున్న విరాట్ కోహ్లీకి ఇండోర్ టీ20లో విశ్రాంతినిచ్చింది టీమ్ మేనేజ్‌మెంట్...

58
Image credit: PTI

ఆసియా కప్ 2022 టోర్నీలో ఆఫ్ఘానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ , ఆఖరి టీ20 మ్యాచ్‌లో ఆడతాడా? లేదా? అనేది కూడా డౌటే అంటున్నారు అభిమానులు. గౌహతిలో జరిగిన రెండో టీ20లో రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డాడు. అలాగే అతని ముక్కులో నుంచి రక్తస్రావం కూడా అయ్యింది...

68
Image credit: PTI

దీంతో అతనికి ముందు జాగ్రత్తగా రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఆఖరి టీ20 మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో మ్యాచ్ ఆడనుంది టీమిండియా. సౌతాఫ్రికా టూర్‌లో భారత కెప్టెన్‌గా ఓ టెస్టు, మూడు వన్డేల్లో ఓడిన కెఎల్ రాహుల్, ఈ ఏడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత సఫారీ జట్టుతో జరిగిన టీ20 సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాల్సింది...

78
Image credit: PTI

అయితే సిరీస్ ఆరంభానికి ముందు కెఎల్ రాహుల్ గాయం కారణంగా తప్పుకోవడంతో ఆ అవకాశం రిషబ్ పంత్‌కి దక్కింది. కెప్టెన్‌గా మొదటి రెండు మ్యాచుల్లో ఓడినా ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో విజయాలు అందుకున్నాడు రిషబ్ పంత్...

88

విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ రెస్ట్ తీసుకుంటే భారత జట్టు బ్యాటింగ్ విభాగం వీక్ అయిపోతుంది. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో రిజర్వు బెంచ్‌లో శ్రేయాస్ అయ్యర్‌ రూపంలో ఒకే ఒక్క బ్యాటర్ మాత్రమే అందుబాటులో ఉన్నాడు. మరి టీమిండియా ఎలాంటి మార్పులు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది...

Read more Photos on
click me!

Recommended Stories