టాప్ స్కోరర్‌ని పక్కనబెట్టి, వరల్డ్ కప్‌ టీమ్‌ని తయారుచేస్తున్న టీమిండియా... శిఖర్ ధావన్ లేకుండా..

Published : Jan 09, 2023, 12:19 PM IST

శిఖర్ ధావన్ ఆటతీరుకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో సమానమైన క్రేజ్ రావాల్సింది. అయితే కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు గాయాల బారి పడి జట్టుకి దూరమైన శిఖర్ ధావన్, తొలుత టెస్టు ఫార్మాట్‌కి, ఆ తర్వాత టీ20 ఫార్మాట్‌కి దూరమయ్యాడు...

PREV
17
టాప్ స్కోరర్‌ని పక్కనబెట్టి, వరల్డ్ కప్‌ టీమ్‌ని తయారుచేస్తున్న టీమిండియా... శిఖర్ ధావన్ లేకుండా..
Shikhar Dhawan

కొన్నాళ్లుగా వన్డేలకు మాత్రమే పరిమితమవుతూ వస్తున్న శిఖర్ ధావన్, శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు. 2019 వన్డే వరల్డ్ కప్‌లో గాయపడి టీమ్‌కి దూరమైన శిఖర్ ధావన్, 2023 వన్డే వరల్డ్ కప్‌లో ఆడాలని అనుకున్నాడు...

27

టీ20 ఫార్మాట్‌లో అవకాశం ఇవ్వకపోయినా వన్డే ఫార్మాట్‌లో కొన్ని సిరీస్‌లకు కెప్టెన్సీ చేసే అవకాశం కూడా శిఖర్ ధావన్‌కి కల్పించింది టీమిండియా. బంగ్లా టూర్‌కి ముందు న్యూజిలాండ్‌తో భారత జట్టు ఆడిన ఆఖరి వన్డే సిరీస్‌కి కెప్టెన్ శిఖర్ ధావనే...

37
Image credit: Getty

2020 నుంచి 2022 వరకూ టీమిండియా తరుపున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో ఉన్నాడు శిఖర్ ధావన్. శిఖర్ ధావన్ 2020-22 మధ్యలో 33 ఇన్నింగ్స్‌లు ఆడి 1275 పరుగులు చేశాడు...

47
Shikhar Dhawan

గాయం కారణంగా జట్టుకి దూరమై రీఎంట్రీ ఇచ్చిన శ్రేయాస్ అయ్యర్, ఇదే సమయంలో 25 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 1061 పరుగులు చేశాడు. ఈ మూడేళ్ల కాలంలో వన్డేల్లో 1000+ పరుగులు చేసిన భారత బ్యాటర్లు ఈ ఇద్దరే...

57
Image credit: Getty

కెఎల్ రాహుల్ 21 ఇన్నింగ్స్‌ల్లో 871 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 23 ఇన్నింగ్స్‌ల్లో 862 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 14 ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడి 510 పరుగులు చేశాడు...

67

శుబ్‌మన్ గిల్ 13 ఇన్నింగ్స్‌ల్లో 671 పరుగులు చేసి వన్డేల్లో శిఖర్ ధావన్‌కి రిప్లేస్‌మెంట్‌గా ఆశలు రేపుతున్నాడు. రిషబ్ పంత్ 13 ఇన్నింగ్స్‌ల్లో 519 పరుగులు చేసి వన్డేల్లో కూడా మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు...
 

77

మూడేళ్లుగా భారత జట్టు ఆడిన ప్రతీ వన్డే మ్యాచ్‌లో అందుబాటులో ఉంటూ వచ్చిన శిఖర్ ధావన్, లంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఆడడం లేదు. ఒకవేళ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలోనూ ధావన్‌ని పక్కనబెడితే ఆ ప్రభావం మరోసారి టీమిండియాపై తీవ్రంగా పడే ప్రమాదం లేకపోలేదు...

click me!

Recommended Stories