విరాట్ కోహ్లీకి సూర్యకుమార్ యాదవ్‌కి అదొక్కటే తేడా... సూర్య ఆ గీత దాటగలడా?...

First Published Jan 9, 2023, 11:49 AM IST

విరాట్ కోహ్లీ తర్వాత ఆ రేంజ్‌లో పరుగుల ప్రవాహం సృష్టిస్తున్నాడు సూర్యకుమార్ యాదవ్. గత ఏడాది టీ20ల్లో 1100+ పరుగులు చేసిన సూర్య, ఈ ఏడాది మూడు టీ20ల్లో ఓ హాఫ్ సెంచరీ, మరో సెంచరీ బాదేశాడు. అయితే సూర్య నుంచి సునామీ ఇన్నింగ్స్‌లు వస్తున్నా విరాట్‌లా మ్యాచ్ విన్నర్‌గా నిరూపించుకోలేకపోతున్నాడు..

సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో దుమ్మురేపుతున్నాడు. 45 మ్యాచుల్లో 13 హాఫ్ సెంచరీలు, 3 సెంచరీలు బాదేసి 1578 పరుగులు చేశాడు సూర్య. అది కూడా 180+ స్ట్రైయిక్ రేటుతో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు...

Kohli Suryakumar

అయితే సూర్య బ్యాటు నుంచి వచ్చిన మెరుపుల్లో మెజారిటీ శాతం తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు వచ్చినవే. భారీ లక్ష్యఛేదనలో సూర్య బ్యాటు నుంచి మ్యాచ్ విన్నింగ్స్ మాత్రం ఇప్పటిదాకా రాలేదు. శ్రీలంకతో జరిగిన రెండో టీ20లోనూ 207 పరుగుల లక్ష్యఛేదనలో సూర్య హాఫ్ సెంచరీ చేసి అవుట్ అయ్యాడు...

Virat Kohli-Suryakumar Yadav

విరాట్ కోహ్లీ ‘ఛేజ్ మాస్టర్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు. టాపార్డర్ ఫెయిల్ అయినా మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లతో కలిసి మ్యాచ్‌ని విజయతీరాలకు చేర్చడం విరాట్ కోహ్లీ స్పెషాలిటీ... ఇదే అతనికి బీభత్సమైన పాపులారిటీని, క్రేజ్‌ని, ఫ్యాన్ ఫాలోయింగ్‌ని తెచ్చిపెట్టింది... 

సూర్యలో ఈ రకమైన మ్యాచ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌లు ఇప్పటిదాకా కనిపించలేదు... అదీకాకుండా క్లాస్ రూమ్‌లో పరీక్ష రాయడానికి, బోర్డు ఎగ్జామ్ రాయడానికి చాలా తేడా ఉంది. సూర్యకుమార్ యాదవ్ ద్వైపాక్షిక సిరీసుల్లో, సాధారణ టీమ్స్‌తో చూపించిన ఆటతీరు... కీలక మ్యాచుల్లో చూపించలేకపోతున్నాడు.

Image credit: PTI

పాకిస్తాన్‌తో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్‌లోనూ 30+ స్కోరు చేయలేకపోయాడు సూర్య... అలాగే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇంగ్లాండ్‌తో ఓడిన సెమీ ఫైనల్‌లో సూర్యకుమార్ యాదవ్ త్వరగా అవుట్ అయ్యాడు. ఒత్తిడి లేకుంటే సూర్య ఫ్రీగా బ్యాటింగ్ చేయగలడు. మెరుపులు మెరిపించగలడు. అయితే ప్రెషర్ ఉంటే మాత్రం తన స్టైల్లో ఆడలేక త్వరగా అవుటైపోతున్నాడు...

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నెం.1 పొజిషన్‌లో కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్, నిజమైన మ్యాచ్ విన్నర్‌గా మారాలంటే ఈ లోపాలను సరిచేసుకోవాలి. గ్రౌండ్‌కి అన్ని వైపులా ఆడడం కంటే టీమ్‌కి అవసరమైనప్పుడు ఆడడం చాలా అవసరమనే విషయాన్ని గ్రహించాలని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.. 

Suryakumar Yadav

సూర్య ఆ ఒక్క గీత దాటితే అతనికి తిరుగు ఉండదు. క్రిస్ గేల్, షాహిద్ ఆఫ్రిదీలా భారీ సిక్సర్లు, భారీ ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడే హిట్టర్‌గా కాకుండా విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ మాదిరిగా అసలు సిసలైన మ్యాచ్ విన్నర్‌గా మారతాడు సూర్యకుమార్ యాదవ్.. 

click me!