Published : Nov 10, 2021, 05:02 PM ISTUpdated : Nov 10, 2021, 05:03 PM IST
టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో శిఖర్ ధావన్‌కి చోటు ఇచ్చి ఉంటే, మొదటి రెండు మ్యాచుల్లో టీమిండియా పర్ఫామెన్స్ మరోలా ఉండేదని ట్రోల్స్ వినిపించాయి. ‘మిస్టర్ ఐసీసీ’గా పేరు తెచ్చుకున్న గబ్బర్‌ని పక్కనబెట్టడం వల్లే తొలి రెండు కీలక మ్యాచుల్లో భారత జట్టు విఫలమైందని టాక్ వినిపించింది...
తాజాగా టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో కూడా శిఖర్ ధావన్ పేరు లేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది...
214
టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ఎంపిక చేయని భారత సీనియర్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌లకు తిరిగి చోటు కల్పించిన సెలక్టర్లు, శిఖర్ ధావన్‌ను మాత్రం పట్టించుకోలేదు...
314
ఐపీఎల్ 2020 సీజన్‌లో రెండు వరుస సెంచరీలతో 600+ పైగా పరుగులు చేసిన శిఖర్ ధావన్, 2021 సీజన్‌లో 550+ పరుగులు చేసి ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చాడు...
414
శిఖర్ ధావన్ నిలకడైన బ్యాటింగ్ కారణంగానే చాలా మ్యాచుల్లో విజయాలు అందుకుని, గ్రూప్ స్టేజ్‌లో టేబుల్ టాపర్‌గా నిలవగలిగింది ఢిల్లీ క్యాపిటల్స్...
514
ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత వికెట్ కీపర్ రిషబ్ పంత్, మూడు ఫార్మాట్లలోకి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. దీంతో అంతకుముందు వైట్ బాల్ క్రికెట్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్న కెఎల్ రాహుల్‌కి పని తగ్గింది...
614
ప్రస్తుతం కెఎల్ రాహుల్‌ను రోహిత్ శర్మతో పాటు ఓపెనర్‌గా వాడుతున్నారు. అయితే విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్‌తో సిరీస్ నుంచి రెస్టు తీసుకోవడంతో వన్ డౌన్, టూ డౌన్ ప్లేస్‌లలో సరైన బ్యాట్స్‌మెన్ లేడు...
714
సూర్యకుమార్ యాదవ్‌ను వన్ డౌన్ బ్యాట్స్‌మెన్‌గా, శ్రేయాస్ అయ్యర్‌ని టూ డౌన్ బ్యాట్స్‌మెన్‌గా ఉపయోగించినా ఆ తర్వాత వచ్చే రిషబ్ పంత్ తర్వాత భారత జట్టుకి పెద్దగా బ్యాటింగ్ ఆర్డర్ లేదు...
814
కాబట్టి ఎంతో అనుభవం ఉన్న శిఖర్ ధావన్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేసి ఉంటే, యువకులతో కూడిన జట్టుకి సమతౌల్యం వచ్చి ఉండేదని కామెంట్లు చేస్తున్నారు అభిమానులు...
914
66 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 27.92 సగటుతో 1759 పరుగులు చేసిన శిఖర్ ధావన్‌కి పొట్టి ఫార్మాట్‌లో 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 10వేలకు పైగా పరుగులు చేసిన ధావన్, శ్రీలంక టూర్‌లో కెప్టెన్‌గా వ్యవహరించాడు...
1014
లంక టూర్‌లో కరోనా కారణంగా ప్రధాన ప్లేయర్లు అందరూ జట్టుకి దూరం కావడంతో 2-1 తేడాతో టీ20 సిరీస్ కోల్పోయింది టీమిండియా. ఆ తర్వాత శిఖర్ ధావన్‌కి మళ్లీ పిలుపు రాలేదు...
1114
దీంతో గబ్బర్ టీ20 కెరీర్‌కి ఇక్కడితో ముగింపు కార్డు పడినట్టే అంటున్నారు విశ్లేషకులు. నిలకడగా పరుగులు చేస్తున్నా, యువకులతో పోలిస్తే శిఖర్ ధావన్ స్ట్రైయిక్ రేటు తక్కువగా ఉండడమే అతన్ని పక్కనబెట్టడానికి ప్రధాన కారణంగా మారింది...
1214
అయితే న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో ఏకంగా ఐదుగురు ఓపెనర్లు ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు రుతురాజ్ గైక్వాడ్, కెఎల్ రాహుల్, వెంకటేశ్ అయ్యర్, ఇషాన్ కిషన్ ఓపెనర్లుగా రాణించగలరు...
1314
వీరితో పాటు ఐపీఎల్ 2021 సీజన్ పర్పుల్ క్యాప్ హోల్డర్ హర్షల్ పటేల్, సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో హర్యానా తరుపున ఓపెనర్‌గా రాణించాడు...
1414
దీంతో శిఖర్ ధావన్‌ని ఎంపిక చేసి ఉంటే టీమ్‌లో మరో ఓపెనర్ చేరేవాడని, ఓపెనర్లపై ఫోకస్ పెట్టిన సెలక్టర్లు మిడిల్ ఆర్డర్ కూడా అవసరమనే విషయాన్ని ఎలా విస్మరించారంటూ ప్రశ్నిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...