విరాట్ గురించి ఒక్క పోస్ట్ వేయని ఆ ఫ్రాంఛైజీ... రోహిత్ శర్మకి టీ20 కెప్టెన్సీ దక్కినా...

Published : Nov 10, 2021, 03:47 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టు మ్యాచులతో పాటు టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ పోరాటం కూడా ముగిసిపోయింది. కెప్టెన్‌గా టీ20ల్లో కేవలం రెండే రెండు సిరీస్‌లు ఓడిన విరాట్ కోహ్లీ, వరుసగా 9 టీ20 సిరీస్‌లు గెలిచాడు... టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ వీడ్కోలు గురించి ఐసీసీతో పాటు ఐపీఎల్ ఫ్రాంఛైజీలన్నీ స్పందించాయి...

PREV
18
విరాట్ గురించి ఒక్క పోస్ట్ వేయని ఆ ఫ్రాంఛైజీ...  రోహిత్ శర్మకి టీ20 కెప్టెన్సీ దక్కినా...

విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ వంటి జట్లన్నీ మాజీ  టీ20 సారథికి అభినందనలు తెలుపుతూ పోస్టులు చేశాయి...

28

అయితే ఒక్క ఫ్రాంఛైజీ మాత్రం విరాట్ కోహ్లీ గురించి ఒక్కటంటే ఒక్క పోస్టు కూడా చేయకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ ఫ్రాంఛైజీ మరేదో కాదు, ఐదుసార్లు టైటిల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్...

38

టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మకు అభినందనలు తెలుపు పోస్టు చేసిన ముంబై ఇండియన్స్, టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ గురించి ఒక్క పోస్టు కూడా చేయకపోవడం, ట్రోలింగ్ రావడానికి కారణమైంది...

48

ముంబై ఇండియన్స్ టీమ్, తమ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు జస్ప్రిత్ బుమ్రా, రాహుల్ చాహార్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వంటి తమ ప్లేయర్ల గురించి తరుచూ పోస్టులు చేస్తూ ఉంటుంది...

58

వీరితో పాటు కెఎల్ రాహుల్ వంటి ప్లేయర్ల గురించి కూడా పోస్టులు చేయడం మొదలెట్టింది. అయితే టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహరించి, ఎన్నో విజయాలు అందించిన విరాట్ గురించి నామమాత్రంగానైనా ఒక్క పోస్టు చేయకపోవడం... కోహ్లీ ఫ్యాన్స్‌ని షాక్‌కి గురి చేసింది. 

68

ముంబై ఇండియన్స్ జట్టు ఇంతవరకూ ఐపీఎల్ వేలంలో ఏ ప్లేయర్‌ను రూ.10 కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేసింది లేదు. అత్యధికంగా రోహిత్ శర్మ కోసమే రూ.9.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది ముంబై...

78

విరాట్ కోహ్లీ అంటే ముంబై ఇండియన్స్ జట్టు, ఆ టీమ్ యజమానులకు పెద్దగా పడకపోయినా కెప్టెన్‌గా టీమిండియాకి సేవలు అందించిన ప్లేయర్ గురించి ఒక్క పోస్టు చేయాల్సిందని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...

88

విరాట్ కోహ్లీ గురించి ఒక్క పోస్టు చేయకపోయినా భారత హెడ్ కోచ్ బాధ్యతల నుంచి పదవీ విరమణ తీసుకున్న రవిశాస్త్రి గురించి ఓ పోస్టు చేసింది ముంబై ఇండియన్స్...

Read more Photos on
click me!

Recommended Stories