వన్డే వరల్డ్ కప్‌లో ఎవరున్నా లేకపోయినా శిఖర్ ధావన్ ఉండాల్సిందే... దినేశ్ కార్తీక్ కామెంట్..

First Published Nov 28, 2022, 12:44 PM IST

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీ తర్వాత శిఖర్ ధావన్ కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. ఐపీఎల్‌ 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున వరుసగా రెండు సెంచరీలు బాది రికార్డు క్రియేట్ చేసిన శిఖర్ ధావన్, ఐపీఎల్ 2022 రిటెన్షన్ దక్కించుకోలేకపోయాడు. ఐపీఎల్‌లో మూడు సీజన్లుగా అదరగొడుతున్నా, ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ధావన్‌ని పూర్తిగా టీ20లకు దూరం చేసిన టీమిండియా, వన్డేల్లో మాత్రమే ఆడిస్తోంది..

Image credit: Getty

యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్, టీమిండియా తరుపున వన్డేల్లో రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి మంచి పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. అలాగే కెఎల్ రాహుల్ కూడా రోహిత్ శర్మతో కలిసి వన్డేల్లో ఓపెనింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దీంతో శిఖర్ ధావన్, వన్డే వరల్డ్ కప్ ఆడతాడా? లేదా? అనేది అనుమానంగా మారింది..

Image credit: PTI

వరుసగా రెండు మూడు మ్యాచుల్లో విఫలమైతే శిఖర్ ధావన్ కంటే శుబ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్‌లను వన్డే వరల్డ్ కప్ ఆడించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది టీమిండియా మేనేజ్‌మెంట్. తాజాగా టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్, గబ్బర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.

Image credit: PTI

‘శిఖర్ ధావన్, టీమిండియాకి గన్‌లాంటి ప్లేయర్... ఆ తుపాకీ, ఐసీసీ టోర్నీల్లో అద్భుతంగా పేలుతుంది. శిఖర్ ధావన్ వయసు 35+ దాటేసింది. కుర్రాళ్లను ఆడించాలనే ఉద్దేశంతో ధావన్‌ని పక్కనబెట్టే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి. ఇది టీమిండియాకి మంచిది కాదు..

ఎందుకంటే శిఖర్ ధావన్ అపారమైన అనుభవం టీమిండియాకి చాలా అవసరం. వన్డేల్లో అతను చాలా చక్కగా రాణిస్తున్నాడు. తన అవసరం ఏంటో ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నాడు. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు బాగా రాణించే ప్లేయర్లు చాలా తక్కువమంది ఉంటారు... ధావన్ అలాంటివాడే...

Image credit: PTI

కీలక టోర్నీల్లో శిఖర్ ధావన్ బాగా ఆడతాడు. 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో కూడా శిఖర్ ధావన్ గాయం కారణంగా దూరమయ్యేవరకూ బాగా ఆడాడు... వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్‌‌లో శిఖర్ ధావన్‌ని ఆయుధంలా వాడుకోవచ్చు. ఓపెనర్‌గా ఎలా ఆడాలో అతనికి బాగా తెలుసు...

Image credit: PTI

క్రీజుని చక్కగా వాడుకుంటాడు. అంతేకాకుండా ఐపీఎల్‌లో కెప్టెన్సీ చేయబోతున్నాడు. టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు శిఖర్ ధావన్ ఎవ్వరికీ తక్కువ కాదు, వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు కావాల్సిన అన్ని అర్హతలు అతనికి ఉన్నాయి...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్.. 

click me!