రాహుల్, పంత్ వేస్ట్! టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్సీ రేసులో పృథ్వీ షా... గౌతమ్ గంభీర్ కామెంట్..

First Published Nov 28, 2022, 11:55 AM IST

టీమిండియా తర్వాత కెప్టెన్ ఎవరు? టీ20 వరల్డ్ కప్ 2022 ముగిసిన తర్వాత దీని గురించి చర్చ ఎక్కువైంది. ప్రస్తుతం భారత జట్టుకి వైస్ కెప్టెన్‌గా ఉన్న కెఎల్ రాహుల్‌కి కెప్టెన్సీ దక్కుతుందా? లేక న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి కెప్టెన్సీ చేసిన హార్ధిక్ పాండ్యాకి సారథ్య బాధ్యతలు దక్కుతాయా? అనేది ఆసక్తికరంగా మారింది...

‘ఒకే ఒక్క ఐసీసీ టోర్నీలో ఫెయిల్ అయ్యాడని రోహిత్ శర్మ కెప్టెన్సీని తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. అయితే తర్వాత కెప్టెన్ రేసులో తాను ఉన్నానని హార్ధిక్ పాండ్యా నిరూపించుకున్నాడు. టీమిండియా కెప్టెన్‌గా విజయాలు అందుకోవడమే కాకుండా ఐపీఎల్‌ టైటిల్ కూడా గెలిచాడు...

హార్ధిక్ పాండ్యాతో పాటు పృథ్వీ షా కూడా భారత జట్టుకి కెప్టెన్సీ చేసే సామర్థ్యం ఉన్న ప్లేయర్. పృథ్వీషాని నేను సెలక్ట్ చేయడానికి కారణం అతని యాటిట్యూడ్. పృథ్వీ షా చేసే పనుల గురించి బయట అందరూ చాలా రకాలుగా మాట్లాడుకుంటారు...

పృథ్వీషాకి దూకుడు ఎక్కువ. అదే దూకుడుతో అండర్ 19 వరల్డ్ కప్ గెలిపించాడు. మొదటి బంతి నుంచే అటాకింగ్ మోడ్‌లో ఆడడం షా స్పెషాలిటీ. టీ20 ఫార్మాట్‌కి కావాల్సింది ఇదే. పృథ్వీ షా ఇప్పటికే ముంబై టీమ్ కెప్టెన్‌గా సక్సెస్ అయ్యాడు కూడా...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్..

Prithvi Shaw

2018లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన పృథ్వీ షా, ఈ ఏడాది ఆరంభంలో బీసీసీఐ నిర్వహించిన యో యో టెస్టులో పాస్ కాలేకపోయాడు. కనీసం 16.5 పాయింట్లు తెచ్చుకున్న ప్లేయర్లు, టీమిండియా తరుపున ఆడడానికి ఫిట్‌గా ఉన్నట్టు లెక్క. అయితే పృథ్వీ షా 15 పాయింట్లు కూడా తెచ్చుకోలేకపోయాడు...

ఈ కారణంగానే పృథ్వీషాని పట్టించుకోవడం మానేశారు సెలక్టర్లు. దేశవాళీ టోర్నీల్లో నిలకడగా రాణిస్తున్నా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో కానీ, ఆ తర్వాత జరిగే బంగ్లాదేశ్ సిరీస్‌‌కి కానీ పృథ్వీ షాని ఎంపిక చేయలేదు సెలక్టర్లు..

ఛేతన్ శర్మ సారథ్యంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీపై బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడు రోజర్ భిన్నీ వేటు వేయడానికి పృథ్వీ షా కూడా ఓ కారణం. పృథ్వీ షాని పట్టించుకోకుండా పేలవ ప్రదర్శన ఇస్తున్న ప్లేయర్లకు వరుస అవకాశాలు ఇవ్వడాన్ని బీసీసీఐ చాలా సీరియస్‌గా పరిగణించదని సమాచారం.. 

click me!