శిఖర్ ధావన్ లేకుండా ఆడితే ఏం జరిగిందో మరిచిపోయారా? సౌతాఫ్రికా సిరీస్‌లో ఆడిస్తే...

Published : May 25, 2022, 05:24 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్‌కి భారత జట్టును ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే ఆ జట్టులో భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ పేరు లేకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

PREV
110
శిఖర్ ధావన్ లేకుండా ఆడితే ఏం జరిగిందో మరిచిపోయారా? సౌతాఫ్రికా సిరీస్‌లో ఆడిస్తే...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి భారత జట్టును తయారుచేయడానికి సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌‌‌ను ఉపయోగించుకుంటోంది బీసీసీఐ...

210

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి సీనియర్లను పక్కనబెట్టి కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో సౌతాఫ్రికాతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది భారత జట్టు...

310

ఈ సిరీస్‌లో శిఖర్ ధావన్‌కి చోటు ఇవ్వకపోవడంపై బీసీసీఐ మాజీ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఘాటుగా స్పందించారు. ఐపీఎల్ 2021 సీజన్‌లో 600 పరుగులు చేసిన తర్వాత కూడా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు శిఖర్ ధావన్...

410

‘టీ20 వరల్డ్ కప్‌కి జట్టును తయారచేయాలనే ఉద్దేశంతో శిఖర్ ధావన్‌ని సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి ఎంపిక చేయకపోయి ఉండొచ్చు. అయితే టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరుగుతోంది...

510
Image Credit: Getty Images

అక్కడి పిచ్‌లు చాలా క్లిష్టంగా, బౌన్సీ పిచ్‌లు. అలాంటి పిచ్‌ల మీద శిఖర్ ధావన్‌కి మంచి రికార్డు ఉంది. అతనికి మంచి అనుభవం కూడా ఉంది. ఐసీసీ టోర్నీల్లో శిఖర్ ధావన్ ఎలా ఆడతాడో అందరికీ తెలుసు...

610

శిఖర్ ధావన్‌ లాటి ప్లేయర్ అవసరం టీమిండియాకి చాలా ఉంది. అతన్ని పూర్తిగా పక్కనబెట్టే ముందు సౌతాఫ్రికా సిరీస్‌లో ఓసారి ప్రయత్నించి చూడాల్సింది...

710
Shikhar Dhawan

సఫారీ సిరీస్‌లో కూడా అతను ఆడలేకపోతే, పక్కనబెడితే సరిపోయేది.. ఎందుకంటే ఇషాన్ కిషన్ లాంటి మిగిలిన ప్లేయర్లు టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ఎలా ఆడాలో అందరికీ తెలుసు...

810
Shikhar Dhawan

శిఖర్ ధావన్ ఉండి ఉంటే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత జట్టు రిజల్ట్ వేరేగా ఉండేది. అతని స్ట్రైయిక్ రేటు కూడా బాగానే ఉంది. ప్రతీ సీజన్‌లోనూ 400-500 పరుగులు చేస్తూ వస్తున్నాడు, ఇంకేం కావాలి...’ అంటూ కామెంట్ చేశాడు బీసీసీఐ మాజీ ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్...

910
Image Credit: Getty Images

‘శిఖర్ ధావన్ లాంటి ప్లేయర్, టీమ్‌లో ఉండాలని ప్రతీ కెప్టెన్ కోరుకుంటాడు. ఎందుకంటే అతనికి అపారమైన అనుభవం ఉంది. పరిస్థితులకు తగ్గట్టు ఆటతీరును ఎలా మార్చుకోవాలో బాగా తెలిసిన ప్లేయర్...

1010
Shikhar Dhawan

ధావన్ లాంటి ప్లేయర్ ఉంటే టీమ్‌లో కూడా ఆహ్లద వాతావరణం ఉంటుంది. దినేశ్ కార్తీక్ లాంటి సీనియర్‌కి ఓ అవకాశం ఇచ్చినప్పుడు, శిఖర్ ధావన్‌కి ఇవ్వడంలో తప్పేముందు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా... 

click me!

Recommended Stories