అతడి ఎదుగుదలకు విరాట్ కోహ్లీనే కారణం.. లక్నో కెప్టెన్ పై షోయభ్ అక్తర్ కామెంట్స్

Published : May 25, 2022, 04:04 PM ISTUpdated : May 25, 2022, 04:06 PM IST

Virat Kohli - KL Rahul: ఐపీఎల్  లో వరుసగా ఐదు సీజన్లలో 500కు పైగా పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఒకడిగా పేరు దక్కించుకున్న టీమిండియా బ్యాటర్, లక్నో  సూపర్ జెయింట్స్ సారథి కెఎల్ రాహుల్ సక్సెస్ కు విరాట్ కోహ్లినే కారణమంటున్నాడు అక్తర్. 

PREV
16
అతడి ఎదుగుదలకు విరాట్ కోహ్లీనే కారణం.. లక్నో కెప్టెన్ పై షోయభ్ అక్తర్ కామెంట్స్

ఐపీఎల్ లో అదిరిపోయే ప్రదర్శనలతో టీమిండియా లో స్థానం సుస్థిరం చేసుకోవడమే గాక భావి సారథిగా ఎదుగుతున్న కెఎల్ రాహుల్ విజయానికి కారణం విరాట్ కోహ్లీయే నని అంటున్నాడు పాకిస్తాన్ మాజీ పేసర్  షోయభ్ అక్తర్.  

26

జాతీయ జట్టులోకి వచ్చిన తొలినాళ్లతో పాటు ఐపీఎల్ లో  కొన్నిరోజులు అతడు  పెద్దగా రాణించక కష్టాలు పడ్డాడని కానీ అతడికి కోహ్లి పూర్తి మద్దతునిచ్చి ప్రోత్సహించాడని అక్తర్ తెలిపాడు. 

36

రాహుల్ ప్రతిభను గుర్తించిన కోహ్లి.. అతడిని బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు పంపాడు. ఓపెనర్ గా ఆడించి జట్టులో అతడి స్థానాన్ని పర్మినెంట్ చేశాడు. జాతీయ జట్టుతో పాటు ఐపీఎల్ లో కూడా అతడు రాణించడానికి  కోహ్లి ఎంతగానో దోహదం చేశాడు..

46

ఐపీఎల్-15లో రెండు కొత్త జట్లు (గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్) బాగా రాణిస్తున్నాయి. ఆర్సీబీ తో  లక్నో మ్యాచ్ లో మాత్రం నా సపోర్ట్ రాహుల్ జట్టుకే...’ అని అక్తర్ తెలిపాడు.

56

కాగా.. ఐపీఎల్ లో తొలుత సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడినప్పుడు రాహుల్ పెద్దగా రాణించలేదు. కానీ తర్వాత ఆర్సీబీకి వచ్చి  తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. 2018  సీజన్ వరకు అతడు ఆర్సీబీతోనే ఉన్నాడు. ఆ తర్వాత పంజాబ్ కు మారాడు. 

66

ఐపీఎల్ లో అతడి ప్రతిభను గుర్తించిన కోహ్లి ఏకంగా టెస్టు జట్టులోకి  కూడా చోటు కల్పించాడు. అతడు స్వయం తప్పిదాల వల్ల జట్టులో చోటు కోల్పోయినా తిరిగి  వచ్చి తనను తాను ప్రూవ్ చేసుకుని ఇప్పుడు మూడు ఫార్మాట్లలో రెగ్యులర్ ప్లేయర్ అయ్యాడు. 

Read more Photos on
click me!

Recommended Stories