ఐపీఎల్ 2022 సీజన్‌కి ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఐదు సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ కానీ, నాలుగు సార్లు టైటిల్ విన్నర్ సీఎస్‌కే, టూ టైం ఛాంపియన్ కేకేఆర్ లేకుండా ప్లేఆఫ్స్ జరుగుతున్న మొట్టమొదటి సీజన్ ఇదే...
ఐపీఎల్ 2016 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ ఆశలపై నీళ్లు చల్లిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ఈ సారి ప్లేఆఫ్స్‌లో లేదు. దీంతో ఆర్‌సీబీ ఫ్యాన్స్ ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ అనే నినాదాన్ని బలంగా చాటుతున్నారు...
28
రెండు కొత్త జట్లు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, మరోటి 14 సీజన్లుగా టైటిల్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్... పోటీలో ఉండడంతో ఆర్‌సీబీ ఈసారి టైటిల్ ఎలాగైనా గెలిచి తీరాలని కోరుకుంటున్నారు...
38
అయితే ఆర్‌సీబీ ఫ్యాన్స్‌ని భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా భయపెడుతున్నారు. కారణం ఈ సీజన్‌లోనే కాదు, దాదాపు కొన్ని నెలలుగా ఆకాశ్ చోప్రా గెలుస్తుందని అంచనా వేసిన జట్టు, ఓడిపోవడం జరుగుతూ వస్తోంది...
48
ఇంతకుముందు గౌతమ్ గంభీర్ ఎవరు గెలుస్తారని చెబితే, ప్రత్యర్థి జట్టు గెలుస్తుందని డిసైడ్ అయిపోయి బెట్టింగ్ వేసేవాళ్లు అభిమానులు. ఇప్పుడు ఆకాశ్ చోప్రా కూడా మరో గౌతమ్ గంభీర్‌లా తయారయ్యాడు...
58
Chahal
మొదటి క్వాలిఫైయర్‌లో రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుందని అంచనా వేసిన ఆకాశ్ చోప్రా, యజ్వేంద్ర చాహాల్, ప్రసిద్ధ్ కృష్ణ మూడేసి వికెట్లు తీస్తారని చెప్పాడు... తీరా చూస్తే ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్‌లో ఉన్న చాహాల్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు...
68
Image credit: PTI
ఇప్పుడు ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ గెలుస్తుందని, జోష్ హజల్‌వుడ్ మూడు వికెట్లు తీస్తాడని, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇరగదీస్తారని అంచనా వేశాడు ఆకాశ్ చోప్రా... దీంతో ఆర్‌సీబీ ఫ్యాన్స్ తెగ ఫీలైపోతున్నారు...
78
Image credit: PTI
గత మూడు సీజన్లుగా నెగిటివ్ రన్ రేట్ ఉన్నా కాస్త లక్ కలిసి రావడంతో ప్లేఆఫ్స్ చేరుతూ వస్తోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే గత రెండు సీజన్లలోనూ ఎలిమినేటర్ మ్యాచులు ఆడిన ఆర్‌సీబీ, క్వాలిఫైయర్ 2కి అర్హత సాధించలేక నాలుగో స్థానానికే పరిమితమైంది...
88
ఈసారి కూడా ఆర్‌సీబీ టైటిల్ గెలవలేకపోతే బెంగళూరు ఫ్యాన్స్ తట్టుకోలేరు. 15 సీజన్లుగా ఐపీఎల్ టైటిల్ కల నెరవేర్చుకోవడం కోసం ఎదురుచూస్తున్న విరాట్ కోహ్లీ మరోసారి నిరాశతో దిగులుపడడం చూడలేమని అంటున్నారు ఆర్‌సీబీ ఫ్యాన్స్...