స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాడుతూ ఎంజాయ్ చేస్తున్న ధావన్ టీం... వీళ్లు కూడా ముంచరు కదా...

First Published Jul 2, 2021, 12:32 PM IST

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు, ఇంగ్లాండ్‌లో వాలిన తర్వాత ఎలా ఎంజాయ్ చేసిందో, శిఖర్ ధావన్‌ కెప్టెన్సీలో రెండో టీమ్‌ కూడా శ్రీలంకలో దిగిన తర్వాత అలాగే గడుపుతున్నారు. లంక పర్యటనలో భారత జట్టు స్విమ్మింగ్ ఫూల్‌లో ఎంజాయ్‌ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు క్రికెటర్లు...

శ్రీలంక పర్యటనకి టీమిండియా వెళ్లిన ప్రతీసారి, అక్కడి అభిమానుల నుంచి ఘనస్వాగతం లభించేది. అయితే ఈసారి మాత్రం భారత క్రికెటర్లను ఎవ్వరూ పట్టించుకోలేదు. కారణం లంక జట్టు ప్రదర్శనే...
undefined
గత కొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న శ్రీలంక క్రికెట్ టీమ్, ఇంగ్లాండ్ టూర్‌లో మరీ దారుణంగా ఆడుతోంది. మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచుల కోసం ఇంగ్లాండ్‌కి వెళ్లిన లంక జట్టు, ఒక్క విజయం లేకుండా స్వదేశం చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
undefined
ఇప్పటికే టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో కోల్పోయిన శ్రీలంక జట్టు, మొదటి రెండు వన్డేల్లోనూ చిత్తుగా ఓడింది. తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్ జట్టు, రెండో వన్డేల్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది...
undefined
ఆఖరి వన్డేలోనూ శ్రీలంక ఓడిపోవడం ఖాయమని, ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. కారణం ప్రస్తుతం లంక క్రికెటర్లు ఆడుతున్న విధానంపై వారికి పిచ్చి క్లారిటీ రావడం...
undefined
మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచుల సిరీస్ కోసం శ్రీలంకకు చేరిన భారత జట్టు, మూడు రోజుల క్వారంటైన్ పీరియడ్ పూర్తి చేసుకుంది. దీంతో జట్టు మొత్తం కలిసి బయో బబుల్ జోన్‌లో ఉల్లాసంగా గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు.
undefined
గురువారం జట్టు ప్లేయర్లు అందరూ కలిసి స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాడుతూ ఎంజాయ్ చేశారు. సీనియర్లు శిఖర్ ధావన్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, హార్ధిక్ పాండ్యాతో పాటు సీనియర్లు కూడా స్విమ్మింగ్‌ పూల్‌లో ఫోటోలు దిగుతూ, వాలీబాల్ ఆడుతూ గడిపారు
undefined
అంతా బాగానే ఉంది కానీ ఈ పోటోలు బయటికి రావడంతో భారత జట్ట అభిమానుల్లో చిన్న భయం మొదలైంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కి ముందు కూడా విరాట్ కోహ్లీ అండ్ టీమ్ ఇలాగే గడిపి, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
undefined
తీరా చూస్తే... మ్యాచ్ రిజల్ట్ రివర్స్. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా పరాజయం పాలైంది. అయితే ఇప్పుడున్న ఫామ్‌లో శ్రీలంకను ఓడించడం పెద్ద కష్టమేమీ కాకపోయినా, మనోళ్ల ఓవర్ కాన్ఫిడెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు...
undefined
అందుకే శ్రీలంక జట్టును తక్కువ అంచనా వేయకుండా కఠినమైన ప్రాక్టీస్ చేసి, సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని కోరుకుంటున్నారు భారత అభిమానులు. శ్రీలంక అభిమానులు మాత్రం లంక పర్ఫామెన్స్‌తో తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
undefined
ఇంగ్లాండ్‌తో రెండో వన్డేలో ఓడిన లంక జట్టు, అత్యధిక వన్డేలు ఓడిన జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. భారత జట్టు 993 మ్యాచుల్లో 427 మ్యాచుల్లో ఓడి టాప్‌లో ఉండగా, ఆ స్థానాన్ని శ్రీలంక 860 మ్యాచుల్లో 428 వన్డేలు ఓడి లాగేసుకుంది...
undefined
ఇప్పటికే టీ20 వరల్డ్‌కప్ 2021 సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించలేకపోయినా శ్రీలంక జట్టు, ఇంగ్లాండ్ పర్యటనలో పడినంత ఇబ్బంది స్వంత గడ్డ మీద పడకపోవచ్చు... ఎంతైనా వారికి సొంత పిచ్, ప్రేక్షకుల మద్ధతు ఉంటుంది.
undefined
కాబట్టి శిఖర్ ధావన్ అండ్ టీమ్‌కిఈ పర్యటన, టీ20 వరల్డ్‌కప్, ఐపీఎల్ 2021 సీజన్‌కి ముందు మంచి ప్రాక్టీస్‌గా ఉపయోగపడనుంది...
undefined
click me!