నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయడానికి తెగ కష్టపడుతున్నారు, వీళ్లు బౌలర్లా? కపిల్ దేవ్ ఆగ్రహం..

Published : Jul 02, 2021, 11:21 AM IST

ఒకప్పుడు బౌలర్లు, టెస్టుల్లో సుదీర్ఘమైన స్పెల్స్ బౌలింగ్ వేసేవాళ్లు. కానీ వన్డేల్లో కోటా వచ్చిన తర్వాత అది 10 ఓవర్లకు, టీ20 ఫార్మాట్‌కి క్రేజ్ పెరిగిన తర్వాత నాలుగు ఓవర్లకు పడిపోయింది. అయినా నేటి బౌలర్లు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయడానికి తెగ కష్టపడుతుండడం చూస్తుంటే బాధేస్తోందని కామెంట్ చేశాడు భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్...

PREV
113
నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయడానికి తెగ కష్టపడుతున్నారు, వీళ్లు బౌలర్లా? కపిల్ దేవ్ ఆగ్రహం..

ఒకప్పుడు క్రికెటర్లకు ఇన్ని సౌకర్యాలు ఉండేవి కావు. హెల్మెట్లు కూడా లేకుండా ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేవాళ్లు. గాయాలకు ఎదురొడ్డి ఆటపై తమకున్న అంకిత భావాన్ని ప్రదర్శించేవాళ్లు.

213

అలాగే బౌలర్ల ఫిట్నెస్‌కి కావాల్సిన సదుపాయాలు కూడా అందుబాటులో ఉండేవి కావు. అయితే నాటి బౌలర్లు సుదీర్ఘ స్పెల్స్ అలిసిపోకుండా బౌలింగ్ చేసేవాళ్లు.

313

కానీ నేటి బౌలర్లకు అలా కాదు, పక్కా డైట్‌తో పాటు ప్లేయర్లకు కావాల్సిన సకల సదుపాయాలను సమకూరుస్తున్నాయి క్రికెట్ బోర్డులు...

413

అయినా నేటితరం పట్టుమని నాలుగు ఓవర్లు వేయడానికి కష్టపడుతున్నారని, ఇలా చూడడం చాలా బాధగా ఉంటోందని కామెంట్ చేశారు మాజీ క్రికెటర్, 1983 వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్...

513

2018, సెప్టెంబర్‌లో ఇంగ్లాండ్‌ టూర్‌లో చివరిసారిగా టెస్టు మ్యాచ్ ఆడిన హార్ధిక్ పాండ్యా, రెండేళ్లుగా టెస్టుల్లో బరిలో దిగలేదు. 2019 వన్డే వరల్డ్‌కప్ సమయంలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన హార్ధిక్ పాండ్యా, ఆ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు.

613

వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన హార్ధిక్ పాండ్యా, బ్యాటింగ్ చేస్తున్నా... బౌలింగ్‌ చేసేందుకు ఫిట్‌గా లేనట్టుగానే కనిపిస్తున్నాడు...

713

‘ఇప్పుడు సంవత్సరంలో 10 నెలల పాటు క్రికెట్ ఆడాల్సి వస్తోంది. అంటే ఆట ఎక్కువగా ఉంటే, గాయపడే అవకాశాలు కూడా ఎక్కువే. ఇప్పుడు క్రికెట్ చాలా ఈజీ స్పోర్ట్స్ అయిపోయింది...

813

క్రికెట్‌లో రాణించాలంటే ఇప్పుడు బ్యాటింగ్ లేదా, బౌలింగ్‌ నేర్చుకుంటే చాలు. కానీ మా టైంలో అలా ఉండేది కాదు. క్రికెటర్ అనేవాడు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా చేయాల్సి వచ్చేది...

913

ఇప్పుడు క్రికెట్ పూర్తిగా మారిపోయింది. అయినా పట్టుమని నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయడానికి కూడా నేటి క్రికెటర్లు తెగ కష్టపడుతుండడం చూస్తుంటే బాధగా ఉంటుంది... ఏ బౌలర్‌కీ మూడు లేదా నాలుగు ఓవర్లకు మించి బౌలింగ్ చేసే అవకాశం కూడా ఇవ్వడం లేదు...

1013

మా టైంలో ఇలా ఉండేది కాదు. బ్యాటింగ్ ఆర్డర్‌లో చివరగా వచ్చే ప్లేయర్‌ కూడా నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడానికి రావాల్సిందే. వాళ్లకి కూడా 10 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి వచ్చేది...

1113

అలాంటి మైండ్‌సెట్ పెంచుకోవడం వల్ల ఫిట్‌గా ఉండి, మా కండరాలను దృఢంగా ఉంచుకోగలిగాం... ఇప్పటి తరం నాలుగు ఓవర్లు వేస్తే చాలు అనుకోవడం చూస్తుంటే నాకు వింతగా అనిపిస్తూ ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశారు కపిల్ దేవ్...

1213

కపిల్‌దేవ్ తర్వాతి తరమైన సచిన్ టెండూల్కర్ జనరేషన్‌లోనూ వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్, గౌతమ్ గంభీర్, సౌరవ్ గంగూలీ వంటి బ్యాట్స్‌‌మెన్లు కూడా పార్ట్ టైం బౌలర్లుగా 10 ఓవర్ల దాకా బౌలింగ్ చేసేవాళ్లు...

1313

అయితే ప్రస్తుతం అలాంటి పార్ట్ టైం బౌలింగ్ బ్యాట్స్‌మెన్‌, ఎవ్వరూ కనిపించడం లేదు. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు ఐపీఎల్‌లో హ్యాట్రిక్ ఉన్నప్పటికీ అతను ఈ మధ్యకాలంలో బౌలింగ్ వేసింది లేదు.. 

click me!

Recommended Stories