అదరగొట్టిన సుందర్, శార్దూల్ ఠాకూర్... 30 ఏళ్ల నాటి రికార్డు బ్రేక్...

First Published Jan 17, 2021, 10:29 AM IST

మూడో రోజు టీ విరామానికి  253/6 చేసిన టీమిండియా...

ఏడో వికెట్‌కి 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన శార్దూల్, సుందర్...

శార్దూల్ ఠాకూర్‌కి గాయం... టీమిండియా శిబిరంలో ఆందోళన..

గబ్బా టెస్టులో 186 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత జట్టును... యంగ్ ప్లేయర్లు వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ కలిసి ఆదుకున్నారు.
undefined
ఏడో వికెట్‌కి 67 పరుగుల అద్భుత భాగస్వామ్యం నెలకొల్పి, భారత జట్టు స్కోరును 250 పరుగులు దాటించారు.
undefined
మూడో రోజు టీ విరామానికి 6 వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది టీమిండియా.
undefined
మొదటి టెస్టు ఆడుతున్న వాషింగ్టన్ సుందర్ 82 బంతుల్లో 5 ఫోర్లతో 38 పరుగులు చేశాడు.
undefined
మొదటిసారి బ్యాటింగ్ చేస్తున్న శార్దూల్ ఠాకూర్ 62 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేశారు.
undefined
ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కి 67 పరుగులు జోడించారు. నాలుగో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌లో ఇదే మొట్టమొదటి హాఫ్ సెంచరీ భాగస్వామ్యం...
undefined
గబ్బా స్టేడియంలో ఏడో వికెట్‌కి ఇదే అత్యధిక భాగస్వామ్యం. 1991లో కపిల్‌దేవ్, ప్రభాకర్ నెలకొల్పిన 58 పరుగుల రికార్డును బ్రేక్ చేశారు శార్దూల్, సుందర్.
undefined
అయితే టీ బ్రేక్ ముందు హజల్‌వుడ్ బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్‌ గాయపడ్డాడు. ఠాకూర్ గాయం టీమిండియాపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
undefined
హజల్‌వుడ్ బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్ వేలికి గాయమైంది. ఫిజియో చికిత్స తర్వాత బ్యాటింగ్ కొనసాగించాడు శార్దూల్ ఠాకూర్.
undefined
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకి ఇంకా 116 పరుగుల దూరంలో ఉంది భారత జట్టు.
undefined
622 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా... 105 పరుగుల వద్ద పూజారా వికెట్ కోల్పోయింది.
undefined
94 బంతుల్లో 25 పరుగులు చేసిన పూజారా, హజల్‌వుడ్ బౌలింగ్‌లో అవుట్ కాగా... 93 బంతుల్లో 3 ఫోర్లతో 37 పరుగులు చేసిన రహానే, స్టార్క్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
undefined
లంచ్ బ్రేక్ తర్వాత 75 బంతుల్లో 3 ఫోర్లతో 38 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్, 29 బంతుల్లో 2 ఫోర్లతో 23 పరుగులు చేసిన రిషబ్ పంత్‌లను అవుట్ చేశాడు హజల్‌వుడ్...
undefined
వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ కలిసి అద్భుత భాగస్వామ్యంతో భారత స్కోరు 250+ దాటించారు.
undefined
click me!