అదిరిందయ్యా నట్టూ... నీలో ఆ ఫైర్ ఉంది... రోహిత్ శర్మ కామెంట్...

First Published Jan 17, 2021, 9:23 AM IST

ఈ మధ్యకాలంలో భారత జట్టులోకి దూసుకొచ్చిన మోస్ట్ టాలెంటెడ్ అండ్ లక్కీ ప్లేయర్ నటరాజన్. వరుణ్ చక్రవర్తికి గాయం కావడంతో భారతజట్టులో స్థానం దక్కించుకున్న నట్టూ... అతి తక్కువ కాలంలో టీ20, వన్డే, టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. తాజాగా నటరాజన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు భారత స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ.

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో వన్డే ఆరంగ్రేటం చేసిన నటరాజన్, మూడు టెస్టుల్లో అద్భుతంగా రాణించి క్రికెట్ విశ్లేషకుల ప్రశంసలు అందుకున్నాడు.
undefined
సీనియర్ బౌలర్లు గాయపడడంతో ఆఖరి టెస్టు జట్టులో చోటు దక్కించుకుని, మొదటి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు నటరాజన్...
undefined
‘నటరాజన్ బౌలింగ్ నిజంగా చాలా బాగుంది... సాధారణంగా భారత పేసర్లు స్వదేశంలో రాణించినట్టుగా, విదేశీ పిచ్‌లపై బౌలింగ్ వేయలేరని విమర్శ ఉండేది...
undefined
కానీ నటరాజన్ ఆడుతున్న మొట్టమొదటి సిరీస్‌లోనే, విదేశీ పిచ్‌లపై అద్భుతంగా రాణిస్తున్నాడు. టాప్ క్లాస్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌కి బౌలింగ్ వేయడమంటే అంత తేలికైన పని కాదు...
undefined
అయినా మొట్టమొదటి సిరీస్ ఆడుతున్న నటరాజన్‌లో ఎలాంటి ఒత్తిడి కనిపించడం లేదు. ఎంతో కాన్ఫిడెన్స్‌గా బౌలింగ్ చేస్తున్నాడు...
undefined
మొదటి బంతి నుంచి అతనిలో ఓ కసి కనిపిస్తోంది... తన క్యారెక్టర్‌లాగే తన బౌలింగ్‌ ఎంత దృఢమైనదో చూపిస్తున్నాడు నట్టూ... అతనికి మంచి భవిష్యత్తు ఉంది’ అంటూ కామెంట్ చేశాడు రోహిత్ శర్మ.
undefined
మొదట ఆస్ట్రేలియా టూర్‌కి కేవలం టెస్టులకి నెట్‌బౌలర్‌గా ఎంపికయ్యాడు నటరాజన్. అయితే వరుణ్ చక్రవర్తి గాయపడడంతో టీ20 జట్టులోకి వచ్చాడు...
undefined
నవ్‌దీప్ సైనీ మొదటి రెండు వన్డేల్లో ఘోరంగా ఫెయిల్ కావడంతో టీ20ల కంటే ముందే వన్డేల్లో ఎంట్రీ ఇచ్చాడు. బుమ్రా గాయంతో తప్పుకోవడంతో నాలుగో టెస్టులో ఆరంగ్రేటం చేశాడు.
undefined
నిజానికి ఐపీఎల్ 2020 సీజన్‌లో కూడా నటరాజన్‌ను తుదిజట్టులో ఆడించాలని భావించలేదట సన్‌రైజర్స్ హైదరాబాద్. అయితే నెట్స్‌లో అతని ప్రదర్శన చూసి షాకైన వీవీఎస్ లక్ష్మణ్, సీజన్‌లో బరిలో దింపారు...
undefined
అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవ్వరినీ నిరుత్సాహపరచకుండా అదరగొడుతున్నాడు నటరాజన్... బుమ్రాకు ప్రత్యామ్నాయ బౌలర్‌గా ఎదుగుతున్నాడు.
undefined
మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన లబుషేన్‌, 45 పరుగులు చేసిన మాథ్యూ వేడ్‌ను అవుట్ చేసిన నటరాజన్, ఆఖర్లో హజల్‌వుడ్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన ఆస్ట్రేలియాను ఆలౌట్ చేశాడు.
undefined
click me!