టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఓ ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రియురాలు మిట్టాలీ పరూల్కర్‌తో శార్దూల్ ఠాకూర్ వివాహం ముంబైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ముంబై ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు...
శార్దూల్ ఠాకూర్ సంగీత్ కార్యక్రమంలో పాల్గొన్న క్రికెటర్లు శార్దూల్ ఠాకూర్, అభిషేక్ నాయర్... పాటలు పాడుతూ శార్దూల్ ఠాకూర్‌తో డ్యాన్స్ చేయించారు...
26
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మార్చి 1 నుంచి ఇండోర్‌లో మూడో టెస్టు జరగనుంది.. మూడో టెస్టుకి రెండు రోజుల ముందు శార్దూల్ ఠాకూర్ పెళ్లి వేడుకలో రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ తళుక్కున మెరవడం హాట్ టాపిక్ అయ్యింది. రోహిత్ శర్మ తన సతీమణి రితికాతో కలిసి ఈ వేడుకకి హాజరయ్యాడు..
36
రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ ముగ్గురూ కూడా దేశవాళీ క్రికెట్‌లో ముంబై తరుపున ఆడతారు. పెళ్లి వేడుక ముగిసిన తర్వాత రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ నేరుగా ఇండోర్ చేరుకుని ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటారు..
46
భారత క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ హాల్దీ వేడుక ఫోటోలు.. ఫోటోలో కుటుంబ సభ్యులతో భారత క్రికెటర్ శార్దూల్ ఠాకూర్..
56
భారత క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ సంగీత్ వేడుక ఫోటోలు.. తన సతీమణి మిట్టాలీ పరూల్కర్‌తో భారత ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్..
66
భారత క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ పెళ్లి వేడుక ఫోటోలు.. హాల్దీ వేడుకలో భార్య మిట్టాలీ పరూల్కర్‌ని హత్తుకుని ఫోటోలకు ఫోజిచ్చిన శార్దూల్ ఠాకూర్... పక్కనే రోహిత్ శర్మ, ఆయన సతీమణి రితికా శర్మ..