ముంబై ఇండియన్స్‌కి షాక్... ఐపీఎల్‌కి దూరంగా జస్ప్రిత్ బుమ్రా! రోహిత్ వదులుతాడా?...

Published : Feb 27, 2023, 09:43 AM IST

ఐపీఎల్ 2023 సీజన్‌కి ముందు ముంబై ఇండియన్స్‌కి ఊహించని షాక్ తగిలింది. కొన్ని నెలలుగా గాయంతో బాధపడుతున్న భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా, ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరం అయినట్టు వార్తలు వస్తున్నాయి...

PREV
18
ముంబై ఇండియన్స్‌కి షాక్... ఐపీఎల్‌కి దూరంగా జస్ప్రిత్ బుమ్రా! రోహిత్ వదులుతాడా?...

అప్పుడెప్పుడో ఆసియా కప్ 2023 టోర్నీకి ముందు వెన్ను గాయంతో టీమ్ నుంచి తప్పుకున్నాడు జస్ప్రిత్ బుమ్రా. ఆసియా కప్ తర్వాత ఫిట్‌గా ఉన్నాడని బుమ్రాని రెండు మ్యాచులు ఆడించారు. అయితే అతని గాయం తిరగబెట్టడంతో మళ్లీ టీమ్‌కి దూరమయ్యాడు...
 

28

గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి దూరమైన జస్ప్రిత్ బుమ్రా, ప్రస్తుతం ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా ఆడడం లేదు. చివరి రెండు టెస్టుల్లో జస్ప్రిత్ బుమ్రా ఆడతాడని ప్రచారం జరిగినా రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక అతనికి రెస్ట్ ఇచ్చేసింది టీమిండియా..

38
Jasprit Bumrah

జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ చేసేందుకు ఇంకా ఇబ్బందిపడుతున్నాడని, అతన్ని ఇప్పడప్పుడే ఆడిస్తే... గాయం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని వైద్యులు సూచించినట్టు సమాచారం. దీంతో బుమ్రాని, ఐపీఎల్ 2023 సీజన్‌కి దూరంగా పెట్టాలని బీసీసీఐ భావిస్తోందట...

48
Jofra Archer

గత సీజన్‌లో 14 మ్యాచుల్లో కేవలం 4 విజయాలు మాత్రమే అందుకుని, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది ముంబై ఇండియన్స్. అయితే ఈసారి ముంబైపై భారీ అంచనాలు ఉన్నాయి.. కారణం జోఫ్రా ఆర్చర్, జస్ప్రిత్ బుమ్రా ఇద్దరూ ఈసారి ఆడతారని అంచనాలే...

58

2022 మెగా వేలంలో జోఫ్రా ఆర్చర్‌ని రూ.8 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. అయితే అతను గాయం కారణంగా గత సీజన్‌లో ఆడలేదు. ఈసారి ఆర్చర్ వస్తాడని, బుమ్రా, అతను కలిసి టీమ్‌కి ఐపీఎల్ టైటిల్ అందిస్తారని ఆశలు పెట్టుకుంది ముంబై...
 

68
Jasprit Bumrah

ముంబై సారథి రోహిత్ శర్మకు జస్ప్రిత్ బుమ్రాపై చాలా నమ్మకం. అతను లేకపోతే ముంబై ఇండియన్స్‌కి విజయాలు దక్కడం కష్టమేనని కూడా రోహిత్ నమ్ముతాడు. ఇంతకుముందు చాలా మ్యాచుల్లో ఇది క్లియర్‌గా కనిపించింది. మరి బుమ్రాకి రెస్ట్ ఇవ్వడానికి రోహిత్ అంగీకరిస్తాడా? అనేది అనుమానంగా మారింది..

78
Image credit: Getty

తాను బౌలింగ్ చేసేందుకు ఫిట్‌గా ఉన్నానని జస్ప్రిత్ బుమ్రా ఎప్పుడో ప్రకటించాడు. అయితే స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌లో బుమ్రా అవసరం పెద్దగా ఉండదని అతనికి రెస్ట్ ఇచ్చారు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం బుమ్రాని సిద్ధం చేయాలని చూస్తోంది టీమిండియా...

88

ఐపీఎల్ అయ్యాక వారం రోజుల గ్యాప్‌లో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరగనుంది. అయితే నేరుగా ఆ మ్యాచ్ ఆడితే రిథమ్ అందుకోవడం కష్టం. కాబట్టి ఆ సాకుతోనైనా ఐపీఎల్‌లో కొన్ని మ్యాచుల్లో బుమ్రా ఆడే అవకాశం లేకపోలేదు.. 

Read more Photos on
click me!

Recommended Stories