టీమిండియాలో పెళ్ళి సందడి! కెఎల్ రాహుల్ తర్వాత లైన్‌లో శార్దూల్ ఠాకూర్... ముహుర్తం ఎప్పుడంటే...

Published : Dec 18, 2022, 01:20 PM IST

టీమిండియాలో పెళ్లి సందడి మొదలైంది. వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్, వచ్చే ఏడాది జనవరిలో బాలీవుడ్ హీరోయిన్ అథియా శెట్టిని వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. రాహుల్ పెళ్లి తర్వాత కొద్దిరోజులకే ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు...

PREV
15
టీమిండియాలో పెళ్ళి సందడి! కెఎల్ రాహుల్ తర్వాత లైన్‌లో శార్దూల్ ఠాకూర్... ముహుర్తం ఎప్పుడంటే...

టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత 2021 నవంబర్‌లో  తన గర్ల్ ఫ్రెండ్ మిట్టాలీ పరూల్కర్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్.  ముంబైలోని తన నివాసంలో అతికొద్ది మంది ఆత్మీయ బంధువుల మధ్య శార్దూల్ ఠాకూర్ ఎంగేజ్‌మెంట్ వేడుక జరిగింది. తన ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన ఫోటోలను కానీ, వార్తను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేయలేదు శార్దూల్...

25

ఆన్ ఫీల్డ్ ఆవేశంగా అరుస్తూ, దూకుడు చూపించే శార్దూల్ ఠాకూర్, బయట మాత్రం చాలా రిజర్వ్‌ అండ్ డీసెంట్. శార్దూల్ ఠాకూర్‌కి కాబోయే సతీమణి మిట్టాలీ కూడా సోషల్ మీడియా అకౌంట్‌ను ప్రైవేట్‌లో పెట్టుకోవడం విశేషం... వీరిద్దరూ 2023, ఫిబ్రవరి 27న వివాహం చేసుకోబోతున్నట్టు సమాచారం.. 

35

ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న శార్దూల్ ఠాకూర్, ఆ తర్వాత శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో స్వదేశంలో జరిగే సిరీసుల్లో పాల్గొంటాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్టు ముగిసిన తర్వాత శార్దూల్ ఠాకూర్, పెళ్లి వేడుకల్లో పాల్గొనబోతున్నాడు...

45

ముంబైలోని కర్జత్‌లో మరాఠీ సంప్రదాయంలో శార్దూల్ ఠాకూర్, మిట్టాలీ పరూల్కర్‌ వివాహ వేడుక జరగనుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ టూర్‌లలో దుమ్మురేపిన శార్దూల్ ఠాకూర్‌ని అభిమానులు ముద్దుగా ‘లార్డ్ శార్దూల్ ఠాకూర్’ అని పిలుస్తారు... రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ కూడా కొన్నిసార్లు ఇలా పిలిచి, శార్దూల్‌ని ఆటపట్టించారు...

55

ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.10.75 కోట్లకు శార్దూల్ ఠాకూర్‌ని కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ఐపీఎల్ 2023 సీజన్‌లో ట్రేడింగ్ ద్వారా శార్దూల్ ఠాకూర్‌ని దక్కించుకున్న కేకేఆర్... ఇదే మొత్తాన్ని చెల్లించబోతోంది.. 

click me!

Recommended Stories