గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న శార్దూల్ ఠాకూర్... అది అయ్యాకే పెళ్లి గురించి ఆలోచన...

Published : Nov 29, 2021, 12:58 PM IST

టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. భారత జట్టులో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా ఉన్న శార్దూల్, తన గర్ల్ ఫ్రెండ్ మిట్టాలీ పరూల్కర్‌తో నిశ్చితార్థం జరుపుకున్నాడు...

PREV
110
గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న శార్దూల్ ఠాకూర్... అది అయ్యాకే పెళ్లి గురించి ఆలోచన...

ముంబైలోని తన నివాసంలో అతికొద్ది మంది ఆత్మీయ బంధువుల మధ్య శార్దూల్ ఠాకూర్ ఎంగేజ్‌మెంట్ వేడుక జరిగింది. తన ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన ఫోటోలను కానీ, వార్తను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేయలేదు శార్దూల్...

210

ఆస్ట్రేలియాలో జరిగే 2022 టీ20 వరల్డ్ కప్ టోర్నీ ముగిసిన తర్వాత శార్దూల్ ఠాకూర్, తన ప్రేయసిని పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం...

310

ఆన్ ఫీల్డ్ ఆవేశంగా అరుస్తూ, దూకుడు చూపించే శార్దూల్ ఠాకూర్, బయట మాత్రం చాలా రిజర్వ్‌ అండ్ డీసెంట్. ఆయన కాబోయే సతీమణి మిట్టాలీ కూడా సోషల్ మీడియా అకౌంట్‌ను ప్రైవేట్‌లో పెట్టుకోవడం విశేషం...

410

బ్రిస్బేన్‌లో జరిగిన ఆస్ట్రేలియా, ఇండియా టెస్టు మ్యాచ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన శార్దూల్ ఠాకూర్, అటు బ్యాటుతో, ఇటు బాల్‌తో రాణించి ఆల్‌రౌండర్‌గా జట్టులో ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాడు...

510

గబ్బా టెస్టులో వాషింగ్టన్ సుందర్‌తో కలిసి 8వ వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పిన శార్దూల్ ఠాకూర్, బౌలింగ్‌లోనూ సత్తా చాటి మూడు వికెట్లు పడగొట్టాడు...

610

ఆ తర్వాత ఇంగ్లాండ్‌ టూర్‌లో దుమ్మురేపిన శార్దూల్ ఠాకూర్‌ని అభిమానులు ముద్దుగా ‘లార్డ్ శార్దూల్ ఠాకూర్’ అని పిలుస్తారు... రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ కూడా కొన్నిసార్లు ఇలా పిలిచి, శార్దూల్‌ని ఆటపట్టించారు. 

710

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున రాణించి, అవసరమైనప్పుడు వికెట్లు తీస్తూ... అదరగొట్టిన శార్దూల్ ఠాకూర్, టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు...

810

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో ఉన్న స్పిన్నర్ అక్షర్ పటేల్‌ను స్టాండ్ బై ప్లేయర్‌గా మారుస్తూ... స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్న శార్దూల్ ఠాకూర్‌ని ఐపీఎల్ తర్వాత జట్టులో చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు సెలక్టర్లు...

910

అయితే పాకిస్తాన్, న్యూజిలాండ్‌లతో జరిగిన మొదటి రెండు మ్యాచుల్లో టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయిన శార్దూల్ ఠాకూర్, ఆ తర్వాత తుదిజట్టులో చోటు దక్కించుకున్నా, చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు...

1010

న్యూజిలాండ్‌తో జరిగిన టీ20, టెస్టు సిరీస్‌కి ఎంపిక కాని శార్దూల్ ఠాకూర్, సౌతాఫ్రికా టూర్‌లో ఆడబోతున్నాడు. ఇందుకోసం ఇండియా ఏ తరుపున సౌతాఫ్రికా - A జట్టుతో జరిగే ఆఖరి టెస్టులో బరిలో దిగనున్నాడు శార్దూల్ ఠాకూర్...

click me!

Recommended Stories