మనవాళ్లే అలా తిట్టేవాళ్లు, ఇప్పటికీ... షాకింగ్ విషయం బయటపెట్టిన మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్..

First Published Nov 29, 2021, 11:48 AM IST

ఇంగ్లాండ్, సౌతాఫ్రికా దేశ క్రికెట్‌లో జాతి వివక్ష, జాత్యాహంకారం గురించి పెద్ద చర్చే జరుగుతోంది. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్లు గ్రేమ్ స్మిత్, ఏబీ డివిల్లియర్స్‌ వంటి లెజెండరీ క్రికెటర్లపై జాత్యాహంకార ఆరోపణలు రాగా, ఇంగ్లాండ్ కౌంటీ క్లబ్ యార్క్‌షైర్‌పై నిషేధం కూడా పడింది. తాజాగా భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్... ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు...

భారత సీనియర్ క్రికెటర్లు ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే వరుసగా ఫెయిల్ అవుతుండడం... స్నిన్‌ను ఎదుర్కొవడంతో వారి టెక్నిక్‌పై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే...

‘విమర్శల గురించి పట్టించుకోకుండా స్పిన్ బౌలింగ్‌ని ఎలా ఎదుర్కోవాలో తెలియాలంటే లక్ష్మణ్ శివరామకృష్ణన్ మాటలను శ్రద్ధగా వినాలి. ఆయన స్నిన్నర్ల గురించి ప్రతీ చిన్న విషయాన్ని ఎంతో క్షుణ్ణంగా, వివరంగా, స్పిన్ టెక్నికాలిటీల గురించి కూడా చెబుతారు...

లక్ష్మణ్ శివరామకృష్ణన్ చెప్పే పాయింట్లు యువ స్పిన్నర్లకు, కొత్త కోచ్‌లకు ఎంతగానో ఉపయోగపడతాయి.. స్పిన్ బౌలింగ్‌పై ఆయనకున్న నాలెడ్జ్ హై క్లాస్...

కామెంటరీ బాక్సులో ఆయన కామెంటరీ విన్నప్పుడల్లా ఒక్కటే అనిపిస్తూ ఉంటుంది. లక్ష్మణ్ శివరామకృష్ణన్ కామెంటరీ బాక్సులో ఉండి టైమ్ వేస్ట్ చేసుకుంటున్నారు... ఆయన ప్రయత్నిస్తే, అద్భుతమైన స్పిన్ కోచ్, బౌలింగ్ కన్సల్టెంట్ అయ్యేవారు...

యువ స్పిన్నర్లు, కోచ్‌లు.. లక్ష్మణ్ శివరామకృష్ణన్ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు, ఆయన అనుభవాన్ని అద్భుతంగా వాడుకోవచ్చు...’ అంటూ ‘క్రికెటాలజిస్ట్’ అనే ట్విట్టర్ ఖాతా ట్వీట్లు చేసింది...

దీనికి స్పందించిన లక్ష్మణ్ శివరామకృష్ణన్.. ‘నేనెప్పుడూ విమర్శలు పాలవుతూనే ఉన్నాను. నా జీవితాంతం నా రంగును తక్కువ చేసి చులకనగా మాట్లాడేవాళ్లు. తిట్టేవాళ్లు... అయితే నేను దాన్ని పట్టించుకోవడం మానేశా...

దురదృష్టకర విషయం ఏంటంటే... మన దేశంలోని వాళ్లే, ఇలా నా రంగును తక్కువ చేసి మాట్లాడేవాళ్లు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మెసేజ్‌లు చేస్తున్నారు...’ అంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు లక్ష్మణ్ శివరామకృష్ణన్...

తమిళనాడు రాష్ట్రానికి చెందిన లక్ష్మణ్ శివరామకృష్ణన్, టీమిండియా తరుపున 9 టెస్టులు ఆడి, 26 వికెట్లు పడగొట్టారు. అలాగే 16 వన్డేల్లో 15 వికెట్లు తీశారు...

click me!