ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. నవంబర్ 30న జరిగే రిటెన్షన్ కార్యక్రమం తర్వాత ఈ మెగా వేలంలో పాల్గొనే ప్లేయర్ల గురించి స్పష్టమైన క్లారిటీ రానుంది. అయితే కొత్త ఫ్రాంఛైజీలకు ఇచ్చిన ‘ఫ్రీ టికెట్’ వివాదాస్పమవుతోంది...
ఐపీఎల్ 2022 సీజన్‌లో పాల్గొనబోయే రెండు కొత్త జట్లు లక్నో, అహ్మదాబాద్... మెగా వేలానికి ముందు ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు వీలుగా ‘ఫ్రీ టికెట్’ పద్ధతిని ప్రవేశపెట్టింది బీసీసీఐ...
212
ఈ ఫ్రీ టికెట్ ద్వారా లక్కో, అహ్మదాబాద్ ఫ్రాంఛైజీలు గరిష్టంగా ముగ్గురు స్వదేశీ, ఓ విదేశీ ప్లేయర్‌ను మెగా వేలానికి ముందే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది...
312
ఇప్పటికే పంజాబ్ కింగ్స్‌కి 2020, 2021 సీజన్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్, వచ్చే సీజన్‌లో లక్నో జట్టు తరుపున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడని వార్తలు కూడా వస్తున్నాయి...
412
ఆర్‌పీ సంజీవ్ గోయింకా గ్రూప్, లక్నో ఫ్రాంఛైజీని రూ.7090 కోట్ల భారీ మొత్తం చెల్లించి దక్కించుకున్న విషయం తెలిసిందే. గతంలో రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ జట్టని నడిపించిన ఆర్‌పీఎస్ గ్రూప్, ఈసారి లక్నో టీమ్‌ని విజేతగా నిలపాలని చూస్తోంది...
512
అందుకే ఎంత ఖర్చు పెట్టేందుకైనా లక్నో ఫ్రాంఛైజీ వెనకాడడం లేదు. కెఎల్ రాహుల్‌తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌తో కూడా లక్నో జట్టు సంప్రదింపులు జరిపిందని టాక్..
612
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీ ప్లేయర్‌గా ఉన్న రషీద్ ఖాన్, వచ్చే రిటెన్షన్‌లో తనకి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్‌ఆర్‌హెచ్‌ని డిమాండ్ చేసినట్టు సమాచారం...
712
నలుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకుని, మొదటి రిటెన్షన్ ప్లేయర్‌కి రూ.16 కోట్లు, రెండో రిటెన్షన్‌క రూ.12 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. రషీద్ ఖాన్‌కి రూ.16 కోట్లు ఇస్తే, కెప్టెన్ కేన్ విలియంసన్‌కి రూ.12 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది...
812
ఈ సమస్య తలెత్తడానికి లక్నో ఫ్రాంఛైజీ జరుపుతున్న అనాధికారిక సంప్రదింపులే కారణమని గ్రహించిన పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు సదరు కొత్త టీమ్‌పై బీసీసీఐకి ఫిర్యాదు చేశాయట...
912
వేలానికి ముందు కానీ, వేలం తర్వాత కానీ ఈ విధంగా వేరే జట్టు ఆటగాళ్లతో ఫ్రాంఛైజీలు సంప్రదింపులు చేయడం ఐపీఎల్ రూల్స్‌కి విరుద్ధం.
1012
ఇంతకుముందు రాజస్థాన్ రాయల్స్‌లో ఉన్న రవీంద్ర జడేజా, ఇలా వేరే జట్టుతో సంప్రదింపులు జరిపి ఏడాది నిషేధానికి గురయ్యాడు...
1112
ఐపీఎల్‌లో మున్ముందు ఉండే సంబంధాల కారణంగా అధికారికంగా లిఖిత పూర్వక ఫిర్యాదు ఇవ్వనప్పటికీ, లక్నో చేస్తున్న సంప్రదింపులపై ఓ లుక్ వేయాల్సిందిగా బీసీసీఐకి సూచించాయట ఈ రెండు జట్లూ...
1212
నిజంగా లక్నో ఫ్రాంఛైజీ ఈ విధంగా ఆటగాళ్లతో సంప్రదింపులు జరిపినట్టు రుజువైతే, నిబంధనలకు విరుద్ధంగా సదరు ఫ్రాంఛైజీకి భారీ జరిమానాతో పాటు కొత్త జట్లతో ఒప్పందాలు కుదుర్చుకున్న ప్లేయర్లపై నిషేధం పడే అవకాశం ఉంటుంది.