టీమిండియాకి ఛాన్సే లేదు! డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడేది ఆ రెండు జట్లే... తేల్చేసిన షేన్ వాట్సన్...

Published : Aug 21, 2022, 12:34 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 సీజన్ అత్యంత ఆసక్తికరంగా మారింది. వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పడిపోయిన ఇంగ్లాండ్... వరుసగా నాలుగు విజయాలు అందుకుని రేసులోకి దూసుకొచ్చింది. అయితే అసలు అవకాశమే ఇవ్వమంటూ ఇంగ్లాండ్‌ని చిత్తు చేసి టాప్ ప్లేస్‌లో సెటిల్ అయిపోయింది సౌతాఫ్రికా... దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం పోటీ రెండు లేదా మూడు జట్లకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది...

PREV
17
టీమిండియాకి ఛాన్సే లేదు! డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడేది ఆ రెండు జట్లే... తేల్చేసిన షేన్ వాట్సన్...

డబ్ల్యూటీసీ 2021-23 సీజన్‌లో 8 టెస్టులు ఆడిన సౌతాఫ్రికా జట్టు, 6 విజయాలు అందుకుని 2 పరాజయాలతో 75 శాతం సక్సెస్ రేటు నమోదు చేసింది. రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 10 మ్యాచుల్లో 6 విజయాలు అందుకుని, ఓ పరాజయం చవిచూసింది. మూడు మ్యాచులు డ్రాగా ముగిశాయి... ఆసీస్ విజయాల శాతం 70...

27

మూడో స్థానంలో ఉన్న శ్రీలంక 10 టెస్టులు ఆడి 5 విజయాలు అందుకుని నాలుగింట్లో ఓడితే... టీమిండియా 12 మ్యాచుల్లో 6 విజయాలు, 4 పరాజయాలు, రెండు డ్రా మ్యాచులతో నాలుగో స్థానంలో ఉంది. 

37

‘ఇప్పటికైతే నాకు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లే ఫైనల్ ఆడతారని అనిపిస్తోంది. ఈ రెండు జట్లూ ఫైనల్ చేరకుండా అడ్డుకోవడం చాలా కష్టం. ఆసీస్, సౌతాఫ్రికా జట్లు చాలా మంచి క్రికెట్ ఆడుతున్నాయి. శ్రీలంకతో జరిగిన టెస్టు ఒక్కటీ తీసేస్తే... ఆస్ట్రేలియా ఈ సీజ్‌లో చాలా చక్కని ఆటతీరు కనబర్చింది...

47

అయితే భారత్, పాకిస్తాన్ జట్లను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆ రెండు జట్లలో కూడా చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. విదేశాల్లో కూడా విజయాలు అందుకోగల సత్తా ఈ రెండు జట్లకి ఉంది. అయితే ఈ రెండు జట్లలో ఏది ఫైనల్‌కి వచ్చినా నాకు అది సర్‌ప్రైజే...

57
shane watson

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆడితే బాగుండని నాకు అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. నేను ఆడే రోజుల్లో దీని గురించి చాలా చర్చ జరిగింది. ఇలా ఓ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ రాబోతుందని అన్నారు. అప్పుడే ఎప్పుడెప్పుడు ఆడతామా అని ఎదురుచూశాను...

67

అయితే అది కార్యరూపం దాల్చడానికి చాలా సమయం పట్టింది. నాతో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఆడాలని ఆశపడిన చాలామంది క్రికెటర్లు, రిటైర్ కూడా అయిపోయారు. 2005లో ఆస్ట్రేలియా, వరల్డ్ ఎలెవన్ మధ్య జరిగిన ‘సూపర్ టెస్టు’ మ్యాచ్ ఆడడం నాకు ఇప్పటికీ గుర్తుంది...

77

అది చాలా స్పెషల్ మ్యాచ్. నేను అప్పుడప్పుడే టెస్టుల్లో ఆరంగ్రేటం చేశాను. టెస్టుల్లో ఐసీసీ ఈవెంట్ గెలిచిన జట్టులో నేను సభ్యుడిగా ఉండడం... నా కెరీర్‌లో ఎప్పుడూ మరిచిపోలేను...’ అంటూ చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్... 

click me!

Recommended Stories