సమస్య అతనిలో లేదు! మనలోనే ఉంది... విరాట్ కోహ్లీ ఫామ్‌పై యజ్వేంద్ర చాహాల్ కామెంట్...

First Published Aug 21, 2022, 10:28 AM IST

విరాట్ కోహ్లీ అంతర్జాతీయ సెంచరీ చేసి 1000 రోజులు దాటిపోయింది. అప్పుడెప్పుడో 2019లో వెస్టిండీస్‌పై చివరి సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత 70కి పైగా ఇన్నింగ్స్‌లు ఆడినా సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు. తాజాగా విరాట్ ఫామ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్...

virat kohli

విరాట్ కోహ్లీ లాస్ట్ సెంచరీ తర్వాత 74 ఇన్నింగ్స్‌లు ఆడి, 2554 పరుగులు చేశాడు. టీమిండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రోహిత్ తర్వాతి స్థానంలో ఉన్నాడు విరాట్ కోహ్లీ. రోహిత్ శర్మ (2634 పరుగులు) ఈ మూడేళ్లలో 20 హాఫ్ సెంచరీలు చేస్తే, విరాట్ కోహ్లీ 24 హాఫ్ సెంచరీలతో టాప్‌లో ఉన్నాడు...

Virat Kohli

2022లో విరాట్ కోహ్లీ ఆడిన మ్యాచుల కంటే రెస్ట్ తీసుకున్న మ్యాచుల సంఖ్యే ఎక్కువ. వెస్టిండీస్, జింబాబ్వే, ఐర్లాండ్ టూర్లకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ... ఆసియా కప్ 2022 ద్వారా ఆరంగ్రేటం చేయబోతున్నాడు. ఈ మధ్య వరుసగా విఫలమవుతున్న విరాట్ కోహ్లీ, ఆసియా కప్‌లో ఫెయిల్ అయితే టీ20 వరల్డ్ కప్‌లో చోటు ఉండదని టాక్ కూడా వినబడుతోంది..

‘టీ20ల్లో అతనికి 50+ యావరేజ్ ఉంది. రెండు టీ20 వరల్డ్ కప్స్‌లో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డులు గెలిచాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 70 సెంచరీలు చేశాడు... మూడు ఫార్మాట్లలో అతని యావరేజ్ చూడండి...

సమస్య ఎక్కడుందంటే మనలోనే ఉంది. మనం కేవలం అతను సెంచరీలు చేయడం లేదని మాత్రమే ఆలోచిస్తున్నాం. సెంచరీ చేయకపోయినా విరాట్ కోహ్లీ చేస్తున్న 60-70 పరుగులు... టీమ్‌కి ఎంత ఉపయోగపడుతున్నాయో మాత్రం అర్థం చేసుకోవడం లేదు... ఎందుకంటే విరాట్ స్టాండెడ్స్‌ని అంతలా ఆకాశానికి పెంచేశాడు...

Virat Kohli

విరాట్ కోహ్లీ క్రీజులో ఉండి 15-20 పరుగులు చేస్తే.. అతనికి బౌలింగ్ చేయడానికి ఏ బౌలర్ కూడా ఇష్టపడడు. ఎందుకంటే విరాట్ వరల్డ్ క్లాస్ బ్యాటర్ అనే విషయం వారికి తెలుసు...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా బౌలర్ యజ్వేంద్ర చాహాల్...

Image credit: PTI

‘కెప్టెన్లు మారినా నా రోల్ మాత్రం మారదు. ఎందుకంటే అందరూ నన్ను వికెట్ టేకింగ్ బౌలర్‌గానే చూస్తారు. నాకు కూడా వాళ్లంతా ఒక్కటే. బౌలర్‌గా నాకు కావాల్సిన స్వేచ్ఛ దొరుకుతుంది... నేనేం చేయాలో వాళ్లు ముందుగానే చెబుతారు...
 

Image credit: PTI

కొన్నిసార్లు రోహిత్ భయ్యా నా దగ్గరికి వచ్చి, పరిస్థితి ఇలా ఉంది? నువ్వేం చేయగలవో చెప్పు..? అంటూ వివరిస్తాడు. ఓ బౌలర్‌గా నేనేం చేయగలనో చెప్తాను. ఓ బౌలర్‌గా ఏ ఓవర్‌లోనూ మనకి విశ్రాంతి దొరకదు... ఎప్పుడైనా బౌలింగ్ చేయడానికి, ఛాలెంజ్ స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి...’  అంటూ కామెంట్ చేశాడు యజ్వేంద్ర చాహాల్...

Chahal

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో యజ్వేంద్ర చాహాల్‌కి చోటు ఇవ్వడం తీవ్ర వివాదాస్పదమైంది. నాలుగేళ్లుగా టీ20 ఫార్మాట్‌లో టీమిండియాకి ప్రధాన బౌలర్‌గా ఉంటున్న చాహాల్‌ని కాదని వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహార్ వంటి కొత్త స్పిన్నర్లకు అవకాశం ఇచ్చారు సెలక్టర్లు...

Image credit: PTI

అయితే 2021 పొట్టి ప్రపంచకప్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహార్.. ఆ తర్వాత భారత జట్టులో కనిపించలేదు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి టీ20 వరల్డ్ కప్‌లో యజ్వేంద్ర చాహాల్‌ని కచ్ఛితంగా ఎంపిక చేస్తారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు... 

click me!