మావోడికి గాయమై వాళ్లు బతికిపోయారు... వకార్ యూనిస్ ట్వీట్ వైరల్! ఆడుకుంటున్న టీమిండియా ఫ్యాన్స్...

First Published Aug 21, 2022, 12:06 PM IST

ఒక్క విజయం... వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన పాకిస్తాన్‌కి కొమ్ములు మొలిచేలా చేసింది. గత ఏడాది టీ20 వరల్డ్ కప్‌ 2021లో పాకిస్తాన్‌ చేతుల్లో 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది టీమిండియా. పాక్ స్టార్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిదీ... మూడు కీలక వికెట్లు తీసి భారత జట్టు ఓటమిలో కీలక పాత్ర పోషించాడు... 
 

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో మొదటి బంతికే రోహిత్ శర్మను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు షాహీన్ షా ఆఫ్రిదీ. ఆ తర్వాతి ఓవర్‌లో కెఎల్ రాహుల్ కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇదే... ఈ పర్ఫామెన్సే... షాహీన్ ఆఫ్రిదీని పాక్‌లో సూపర్ స్టార్‌ని చేసేసింది...

Shaheen Afridi

ఈ మ్యాచ్ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగలేదు. ఈసారి ఆసియా కప్ 2022 టోర్నీలో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లో షాహీన్ ఆఫ్రిదీని రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ ఎలా ఎదుర్కొంటారో చూడాలని క్రికెట్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూశారు. అయితే అనుకోకుండా గాయం కారణంగా షాహిన్ ఆఫ్రిదీ ఈ టోర్నీకి దూరమయ్యాడు...

Shaheen Afridi

‘షాహీన్ గాయం.. భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌కి బిగ్ రిలీఫ్. మనం అతన్ని ఆసియా కప్ 2022 టోర్నీలో చూడలేకపోవడం బాధాకరం. త్వరలో కోలుకో ఛాంప్...’ అంటూ పాక్ మాజీ క్రికెటర్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది...

Image credit: Getty

రోహిత్ శర్మకు షాహీన్ ఆఫ్రిదీపై మంచి రికార్డు ఉంది. 2019 వన్డే వరల్డ్ కప్‌ టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు రోహిత్. అలాంటిది ఒక్క మ్యాచ్‌లో అతన్ని తక్కువ చేసి మాట్లాడడంపై తీవ్రంగా స్పందిస్తున్నారు భారత అభిమానులు...

Shaheen afridi

‘ఎలాగోలా అతన్ని ఫిట్‌గా చేసి ఆసియా కప్‌ ఆడించడం, మీవోడు ఈసారి ఎన్ని వికెట్లు తీస్తాడో మేమూ చూస్తాం...’ అని కొందరు కామెంట్లు చేస్తుంటే... ‘ఒక్క మ్యాచ్ గెలవగానే వీళ్లకి విజయగర్వంతో మతి భ్రమించిందని, అంతకుముందు జరిగిన మ్యాచులన్నీ మరిచిపోయినట్టున్నారని’ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు...

Shaheen Afridi

ఏడుసార్లు ఆసియా కప్ గెలిచిన భారత జట్టును 2 సార్లు... అది కూడా భారత్‌ ఆడని ఎడిషన్‌లో ఓసారి టైటిల్ గెలిచిన పాకిస్తాన్... ఇలా తక్కువ చేసి మాట్లాడడం నిజంగా వెర్రితనమేనని అంటున్నారు ఇంకొందరు నెటిజన్లు... 

జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా ఆసియా కప్ 2022 టోర్నీ నుంచి తప్పుకున్నప్పుడు ఏ భారత క్రికెటర్ కూడా ఈ విధంగా పాక్ బ్యాటర్ల గురించి ట్వీట్ చేయలేదని... అది భారతీయుల సంస్కారం అని, పాక్‌ క్రికెటర్లు మాత్రం తాము మారమని మళ్లీ మళ్లీ నిరూపించుకుంటున్నారని వకార్ యూనిస్ ట్వీట్‌తో అర్థమవుతోందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా ఈసారి టీమిండియా చేతుల్లో ఓడిపోతే... మా షాహీన్ ఆఫ్రిదీ లేకనే గెలిచారని పోస్టులు చేయడానికి పాకిస్తానీ క్రికెట్ ఫ్యాన్స్‌కి ఓ కారణం దొరికిందనేది మాత్రం వాస్తవం. 

click me!