ఒకటి, రెండేళ్ల పాటు సూపర్ ఫామ్‌లో ఉంటే చాలు... విరాట్ కోహ్లీతో సమానంగా, లేదా అతనికంటే తోపు అంటూ చెప్పడం క్రికెట్ ఫ్యాన్స్‌కి అలవాటుగా మారిపోయింది. తాజాగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, సీఎస్‌కే మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్... ప్రస్తుత తరంలో టాప్ 5 ప్లేయర్ల గురించి చెప్పుకొచ్చాడు..
ఫార్మాట్లతో సంబంధం లేకుండా గత దశాబ్దంలో పరుగుల వరద పారించాడు విరాట్ కోహ్లీ. పదేళ్లలో 20 వేలకు పైగా పరుగులు చేసిన ఏకైక క్రికెటర్‌గా చరిత్ర క్రియేట్ చేసి... ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది డికేడ్’ అవార్డు కూడా దక్కించుకున్నాడు...
211
రెండేళ్ల నుంచి సెంచరీ మార్కు అందుకోలేకపోతున్నా విరాట్ కోహ్లీ బ్యాటు నుంచి పరుగుల ప్రవాహం మాత్రం ఆగడం లేదు. గత రెండేళ్లల్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా ఉన్నాడు కోహ్లీ...
311
Image Credit: Getty Images
ప్రస్తుత తరంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్‌తో పాటు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్... విరాట్ కోహ్లీతో కలిసి నెం.1 టెస్టు బ్యాట్స్‌మెన్ పొజిషన్ కోసం పోటీపడుతున్నారు...
411
‘టెస్టు క్రికెట్‌లో ఎప్పుడూ విరాట్ కోహ్లీయే నెం.1... అతను దాదాపు ఓ సూపర్ హ్యూమన్. విరాట్ కోహ్లీ క్రీజులో ఉంటే చాలు, ఓ హై ఓల్టేజ్ ఎనర్జీ నిండి ఉంటుంది...
511
బాబర్ ఆజమ్ కూడా విరాట్ కోహ్లీ తర్వాతే. బాబర్ ఆజమ్ బాగా ఆడుతున్నాడు. అతను టెస్టు ఫార్మాట్‌ను అలవరుచుకున్న విధానం అద్భుతం...
611
అయితే అతను లెజెండ్‌గా మారడానికి ఇంకా సమయం ఉంది. నా దృష్టిలో బాబర్ ఆజమ్, విరాట్ కోహ్లీ తర్వాతి పొజిషన్‌లోనే ఉంటాడు...
711
స్టీవ్ స్మిత్ ప్రారంభంలో అద్భుతంగా ఆడేవాడు. అయితే ఇప్పుడు అతను బౌలర్లపై పెద్దగా ఒత్తిడి పెంచలేకపోతున్నాడు...
811
ప్రారంభంలో స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీతో పోటీపడ్డాడు. అతను విరాట్ చూపించిన నిలకడ, స్మిత్ బ్యాటింగ్‌లో కొరవడింది. నా దృష్టిలో స్టీవ్ స్మిత్ టాప్ 3లో ఉంటాడు...
911
కేన్ విలియంసన్‌కి కొన్ని శారీరక సమస్యలు ఉన్నాయి. అతని మోకాలి గాయం చాలా ఇబ్బంది పెడుతోంది. అయితే కేన్ విలియంసన్ ఫిట్‌గా ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా క్రీజులో పాతుకుపోయి బౌలర్లను విసిగించగలడు...
1011
Joe Root
జో రూట్ ఎన్ని సెంచరీలు చేసినా... స్టీవ్ స్మిత్‌లాగే లైన్ లోకి రావడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఇంతకుముందు అతను భారీ స్కోర్లు చేయకపోయినా మంచి ఇన్నింగ్స్‌లే ఆడేవాడు...
1111
సెంచరీ అనేది మ్యాచ్‌ని గెలిపించకపోతే దేనికీ పనికి రాదని నా ఉద్దేశం. విరాట్ కోహ్లీ చేసే 70-80 పరుగులు కూడా మ్యాచ్ రిజల్ట్‌నే మార్చేయగలవు. అందుకే విరాట్ ఎప్పుడూ మిగిలిన ప్లేయర్ల కంటే ముందుంటాడు...’ అంటూ కామెంట్ చేశాడు ఆసీస్ మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్...