క్రికెట్ ప్రపంచంలో 100 సెంచరీలు చేసిన మొట్టమొదటి, ఏకైక క్రికెటర్ సచిన్ టెండూల్కర్. ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ పూర్తి చేసుకున్న సెంచరీల కంటే 80ల్లో, 90ల్లో అవుటైన సందర్భాలే ఎక్కువ. డీఆర్‌ఎస్ ఉండి ఉంటే మాస్టర్ టెండూల్కర్ కనీసం 200 సెంచరీలు చేసేవాడని పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే...
సెంచరీ ముగింట అవుటైన ప్రతీసారి సచిన్ టెండూల్కర్ కాస్త నిరాశగా పెవిలియన్ చేరేవాడు. అంపైర్ల తప్పుడు నిర్ణయాల అవుటైనా, చిరునవ్వుతో క్రీజు వదిలి వెళ్లేవాడు...
27
అయితే ఓ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ సెంచరీ మిస్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాడట. ఈ విషయాన్ని తాజాగా వెల్లడించాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్..
37
‘నువ్వు సెంచరీ చేసి, టీమ్ ఓడిపోతే ఏం లాభం... చాలా సార్లు ఇలా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ప్లేయర్లు సెంచరీ చేసినా, టీమ్ ఓడిపోయేది...
47
Sachin Tendulkar
2011 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడుతున్నాం. సచిన్‌తో ఎన్నో మ్యాచుల్లో కలిసి ఓపెనింగ్ చేశాను. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ 85 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
57
తను డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చి సంతోషంగా నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నారని ఆయన అడిగాను. ఆయన ‘నేను, సెంచరీ చేయకపోవడం మంచిదైంది... ఒకవేళ నేను సెంచరీ చేసి మ్యాచ్ ఓడిపోతే... అన్నారు.
67
ఆయన కూడా మనిషే. సెమీస్‌లో విజయం ఎంత ముఖ్యమో సచిన్ టెండూల్కర్‌కి తెలియనిది కాదు. 100 సెంచరీలు చేసిన క్రికెటర్, సెంచరీ ముఖ్యం కాదని భావించారు...
77
అలా చూసుకుంటే జట్టుకి విజయాన్ని ఇచ్చే 90 పరుగులు ఎంతో విలువైనవి. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో శివమ్ దూబే చేసిన 95 పరుగులు సెంచరీతో సమానమే...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్...