భువీ కంటే ఆ పంజాబ్ బౌలర్ చాలా బెటర్.. అతడికి అవకాశమిస్తే అద్భుతాలే : సంజయ్ మంజ్రేకర్ షాకింగ్ కామెంట్స్

Published : Apr 14, 2022, 04:16 PM IST

TATA IPL 2022: టీమిండియా స్వింగ్ కింగ్ భువనేశ్వర్  కుమార్ డెత్ ఓవర్లలో కీలకమైన బౌలర్. కెప్టెన్ ఎవరున్నా.. ఆఖరి ఓవర్లలో ప్రత్యర్థులను కట్టడి చేయడంలో భువీ స్టైలే వేరు. 

PREV
18
భువీ కంటే ఆ  పంజాబ్ బౌలర్ చాలా బెటర్.. అతడికి అవకాశమిస్తే అద్భుతాలే : సంజయ్ మంజ్రేకర్ షాకింగ్ కామెంట్స్

ఐపీఎల్ అయినా భారత జట్టైనా టీ20 లతో పాటు పరిమిత ఓవర్ల క్రికెట్ లో డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడంలో భువనేశ్వర్  స్టైలే వేరు.   ముఖ్యంగా టీ20లలో అయితే సారథిగా ఎవరున్నా ఆఖరి ఓవర్లలో భువీకే బంతినందిస్తారు. 

28

కెప్టెన్ల నమ్మకాన్ని భువీ ఎన్నడూ వమ్ము చేయలేదు.  కట్టుదిట్టంగా బంతులు వేసి ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచడంలో భువనేశ్వర్ సమర్థుడు.

38

అయితే భారత జట్టుకు ఇప్పుడు భువీ అవసరం లేదంటున్నాడు ప్రముఖ మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్. అతడి స్థానాన్ని  భర్తీ చేసే ఆటగాళ్లు చాలా మంది ఉన్నారని, పంజాబ్  కింగ్స్ స్టార్ బౌలర్ అర్షదీప్ సింగ్  ఆ జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడని చెప్పాడు. 

48

మంజ్రేకర్ మాట్లాడుతూ... ‘టీ20లలో డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడానికి ఇండియా ఎప్పుడూ భువనేశ్వర్ వైపే చూస్తున్నది. ఆ సమయంలో అతడు గొప్పగా బౌలింగ్ చేస్తాడు.  అయితే ఇప్పుడు భువీ అవసరం లేదనిపిస్తున్నది. 

58

ఎందుకంటే పంజాబ్ కింగ్స్ లో ఆడుతున్న అర్షదీప్ ను చూడండి. డెత్ ఓవర్లలో అసాధారణ రీతిలో బంతులు విసురుతూ ఆ జట్టును ఆదుకుంటున్నాడు. కట్టుదిట్టంగా బాల్స్ వేసి  పరుగులకు అడ్డుకట్ట వేస్తున్నాడు. 

68

ఒకవేళ అర్షదీప్ గనక భారత జట్టులోకి వస్తే అతడు కచ్చితంగా ఇండియాలో టాప్-5 బౌలర్లలో ఒకడిగా నిలుస్తాడు. అందులో సందేహమే లేదు...’ అని మంజ్రేకర్ తెలిపాడు. 

78

బుధవారం ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో 18వ ఓవర్ వేసిన అర్షదీప్.. 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు.  అప్పటికే క్రీజులో వీర బాదుడు బాదుతున్న సూర్యకుమార్ యాదవ్ ఉన్నా అతడిని నిలువరించాడు. 

88

ఇక నిన్నటి మ్యాచ్ లో అర్షదీప్ పొదుపుగా బౌలింగ్ చేసి పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన అర్షదీప్.. 29 పరుగులు మాత్రమే ఇచ్చాడు.  రబాడా, అర్షదీప్ మినహా.. పంజాబ్ బౌలర్లంతా  భారీగా పరుగులిచ్చుకున్నారు.  

click me!

Recommended Stories