ధోనీ కాదు, విరాట్ కోహ్లీలో ఆ ఇద్దరు లెజెండరీ కెప్టెన్స్ కనిపిస్తున్నారు... మాజీ క్రికెటర్ అమర్‌నాథ్...

టీమిండియాకి మూడు ఐసీసీ టైటిల్స్ అందించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. అయితే కెప్టెన్‌గా ధోనీ రిటైర్ అయిన తర్వాత నాలుగు ఐసీసీ టోర్నీల్లో టీమిండియా టైటిల్ గెలవలేకపోయింది. దాంతో ధోనీతో పోల్చి చూస్తూ కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కొందరు అభిమానులు..

టీ20 కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించాలని ఎప్పటినుంచో డిమాండ్ వినిపిస్తుండగా టెస్టు కెప్టెన్సీ అజింకా రహానేకి అప్పగించాలని డిమాండ్ వినబడుతోంది... అయితే మాజీ క్రికెటర్, 1983 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన మోహిందర్ అమర్‌నాథ్ మాత్రం కోహ్లీకి సపోర్ట్‌గా నిలిచాడు...
‘విరాట్ కోహ్లీ ఓ గొప్ప ప్లేయర్, అంతకుమించి మంచి కెప్టెన్ కూడా. మనం ఎమోషనల్ అవ్వకుండా ఆలోచిస్తే కెప్టెన్ కోహ్లీ, జట్టును ఎలా తీర్చిదిద్దాడో అర్థం అవుతుంది... మనం భారత జట్టుపై భారీ అంచనాలు పెట్టుకున్నాం.

ఫైనల్‌లో ఆ అంచనాలను జట్టు అందుకోకపోవడంతో కెప్టెన్సీని మార్చాలని ఆలోచిస్తున్నాం. కానీ ఫైనల్‌కి ఎలా అర్హత సాధించింది? ఎవరి వల్ల ఫైనల్‌దాకా వెళ్లగలిగింది... విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ తరానికి ఒక్కడే పుడతాడు...
క్రికెట్ ఎవరి కోసం ఆగడు. ఇప్పటి తరానికి అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఏడాది మొత్తానికి క్రికెట్ ఆడుతున్నారు. ప్లేయర్లలో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు. అందుకే ఫైనల్‌కి వచ్చేసరికి ఎన్నో అంచనాలు పెరిగిపోతున్నాయి.
నాకు విరాట్ కోహ్లీలో ధోనీ కాదు... వీవ్ రిచర్డ్స్, ఇంకా రికీ పాంటింగ్ కనబడుతున్నారు. అతను బ్యాటింగ్‌లో గొప్ప ప్లేయర్ అయితే తన అనుభవం, పర్ఫామెన్స్‌తో జట్టును ముందుండి నడిపించే లీడర్ కూడా...
భారత జట్టుకి విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా కొనసాగించడం చాలా అవసరం. టీమ్ ఇప్పుడు చాలా బ్యాలెన్సిడ్‌గా ఉంది కానీ వారికి తగినంత ప్రాక్టీస్ దొరకలేదు... న్యూజిలాండ్‌కి ప్రాక్టీస్ దొరికింది. పరిస్థితులు కలిసి వచ్చాయి.
డబ్ల్యూటీసీ టైటిల్ గెలిచినందుకు న్యూజిలాండ్ జట్టును అభినందించాల్సిందే. అయితే అందుకని విరాట్ కోహ్లీని విమర్శించాల్సిన అవసరం లేదు...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ మోహిందర్ అమర్‌నాథ్..
1983 వన్డే వరల్డ్‌కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన మోహిందర్ అమర్‌నాథ్.... ‘భారత జట్టుకి మొదటి నుంచి ఎంతోమంది గొప్ప ప్లేయర్లు దొరికారు. సీకే నాయుడు, అలాగే మా తండ్రి లాలా అమర్‌నాథ్, వినూ మన్కడ్... 1960, 70, 80ల్లో వీరి పర్ఫామెన్స్ కారణంగా భారత జట్టు ఎన్నో విజయాలు అందుకుంది’ అంటూ కామెంట్ చేశాడు.

Latest Videos

click me!