షేన్ వార్న్ గొప్ప స్పిన్నర్ కాదు, ఓ ఆర్డినరీ స్పినర్... సునీల్ గవాస్కర్‌ కామెంట్లపై దుమారం...

Published : Mar 07, 2022, 01:35 PM IST

ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వార్న్ అకాల మరణంతో క్రికెట్ ప్రపంచంలో విషాదం నెలకొంది. షేన్ వార్న్ ఆస్ట్రేలియా టీమ్‌కి, ఐపీఎల్‌కి, క్రికెట్ ప్రపంచానికి అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ, ఆసీస్ లెజెండ్‌కి నివాళులు అర్పిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

PREV
112
షేన్ వార్న్ గొప్ప స్పిన్నర్ కాదు, ఓ ఆర్డినరీ స్పినర్... సునీల్ గవాస్కర్‌ కామెంట్లపై దుమారం...

షేన్ వార్న్ మరణ వార్త తెలిసిన సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ వంటి మాజీ భారత లెజెండరీ క్రికెటర్లు కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు...

212

అయితే భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం షేన్ వార్న్‌ గొప్ప స్పిన్నర్ కాదని, ఓ ఆర్డనరీ స్పిన్నర్ అంటూ కామెంట్ చేయడంతో తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది...

312

షేన్ వార్న్ మరణ వార్త తెలిసిన తర్వాత ఓ ప్రముఖ ఛానెల్‌లో సంతాప కార్యక్రమానికి హాజరైన సునీల్ గవాస్కర్... వార్న్‌పై విమర్శలు గుప్పించాడు...
 

412

షేన్ వార్న్ మరణ వార్త తెలిసిన తర్వాత ఓ ప్రముఖ ఛానెల్‌లో సంతాప కార్యక్రమానికి హాజరైన సునీల్ గవాస్కర్... వార్న్‌పై విమర్శలు గుప్పించాడు...

512

‘షేన్ వార్న్ ఆల్‌ టైం గ్రేట్ స్పిన్నర్ అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే అతని కంటే భారత్‌లో చాలా గొప్ప స్పిన్నర్లు ఉన్నారు. ముత్తయ్య మురళీధరన్ కూడా గొప్ప స్పిన్నర్..

612

షేన్ వార్న్‌కి భారత ఉపఖండ పిచ్‌లపై పెద్ద చెప్పుకోదగ్గ రికార్డులు లేవు. అతను ఇక్కడ ఓ సాధారణ స్పిన్నర్‌గానే పర్పామ్ చేశాడు...

712

నాగ్‌పూర్‌లో జరిగిన ఓ టెస్టులో ఐదు వికెట్లు తీశాడు. అది కూడా ఆ మ్యాచ్‌లో జహీర్ ఖాన్ అనవసర షాట్‌కి ప్రయత్నించి అవుట్ కావడంతో ఐదు వికెట్లు దక్కాయి... 

812

వార్న్ ఇక్కడ పెద్దగా రాణించలేకపోయాడు. షేన్ వార్న్‌తో పోలిస్తే ముత్తయ్య మురళీధరన్, అనిల్ కుంబ్లే లాంటి స్పిన్నర్లు ఉపఖండ పిచ్‌ల పైనే కాకుండా విదేశీ పిచ్‌లపైన కూడా వికెట్లు రాబట్టగలిగారు... కాబట్టి షేన్ వార్న్ నా దృష్టిలో గ్రేటెస్ట్ కాదు.. ’ అంటూ వ్యాఖ్యానించాడు సునీల్ గవాస్కర్...

912

షేన్ వార్న్ చనిపోయిన తర్వాత ఇలాంటి కామెంట్లు చేయడంతో సునీల్ గవాస్కర్‌పై తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది. సమయం, సందర్భం తెలియకుండా ఇలాంటి కామెంట్లు చేయడమేంటని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు...

1012

వ్యక్తిగా, స్పిన్నర్‌గా షేన్ వార్న్‌కి గౌరవం ఇవ్వకపోయినా క్రికెట్ ప్రపంచానికి ఆయన అందించిన సేవలకు గవాస్కర్ విలువ ఇచ్చిఉంటే బాగుండేదని అంటున్నారు నెటిజన్లు...

1112

స్వదేశంలో పరుగులు చేసే రోహిత్ శర్మ, ముంబై ప్లేయర్ కావడంతో గొప్ప క్రికెటర్ అని కీర్తించే సునీల్ గవాస్కర్... షేన్ వార్న్ మరణాన్ని కూడా భారత స్పిన్నర్లు, ముత్తయ్య మురళీధరన్ మంచి స్పిన్నర్లని నిరూపించుకోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు... 

1212

విమర్శలు చేయడానికి కూడా సమయం, సందర్భం అనేవి ఉంటాయని... ఓ లెజెండరీ క్రికెటర్ అకాల మరణంతో క్రికెట్ ప్రపంచంలో విషాదం నెలకొన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని నిలదీస్తున్నారు. 

click me!

Recommended Stories