బాబర్ ఆజమ్‌కి చెక్ పెట్టబోతున్న పీసీబీ... ఇద్దరు కెప్టెన్ల పాలసీకే బెటర్ అంటున్న ఆఫ్రిదీ...

First Published Jan 20, 2023, 4:50 PM IST

పాకిస్తాన్ క్రికెట్‌ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కి చెక్ పెట్టేందుకు సిద్ధమైంది పీసీబీ. గత రెండేళ్లలో స్వదేశంలో ఒక్క టెస్టు కూడా గెలవలేకపోయింది పాకిస్తాన్. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 3-0 తేడాతో క్లీన్ స్వీప్ అయిన పాకిస్తాన్... వన్డే సిరీస్‌నూ కోల్పోయింది...

న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టులు డ్రాగా ముగిశాయి. అయితే రెండు టెస్టుల్లోనూ ఆతిథ్య జట్టు కంటే న్యూజిలాండ్‌ ఆధిక్యమే ఎక్కువగా సాగింది. ఓ రకంగా చావు తప్పి కట్టు లొట్టబోయినట్టు, ఓటమి నుంచి తప్పించుకుని డ్రాతో గట్టెక్కింది పాకిస్తాన్...

ఇదీకాకుండా రమీజ్ రాజాను పీసీబీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత బాబర్ ఆజమ్‌ని కూడా కెప్టెన్సీ నుంచి తప్పించాలని పాక్ క్రికెట్ బోర్డు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను నిజం చేస్తూ పాక్ తాత్కాలిక చీఫ్ సెలక్టర్ షాహిద్ ఆఫ్రిదీ, ఇద్దరు కెప్టెన్ల పాలసీకే మొగ్గు చూపుతున్నట్టు ప్రకటించాడు...

Image credit: Getty

‘ఆటలో గెలుపు, ఓటములు సహజం. అయితే ఓటమికి ఎప్పుడూ భయపడకూడదు. ముఖ్యంగా ప్రయోగాలు చేయడం వల్ల ఓడిపోతే అది చాలా పెద్ద విషయం. ప్రతీ దాని నుంచి ఎంతో కొంత నేర్చుకోవాలి...
 

Babar Azam

కెప్టెన్‌గా బాబర్ ఆజమ్ ఇంకా ఎంతో నేర్చుకోవాలి, ఎంతో ఎదగాలి. మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లు ఉండాలనే సిద్ధాంతం నాకెప్పుడూ నచ్చదు. అయితే నా వరకూ వన్డేలకు, టెస్టులకు ఓ కెప్టెన్ ఉండాలి.. టీ20లకు మరో కెప్టెన్ ఉండాలి...

రెండు మూడేళ్లుగా బాబర్ ఆజమ్, పాక్ టీమ్‌కి కెప్టెన్‌గా ఉన్నాడు. అతను అద్భుతంగా టీమ్‌ని నడిపిస్తున్నాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా చాలా ఆలోచించి తీసుకుంటాం. తొందరేం లేదు...’ అంటూ కామెంట్ చేశాడు షాహిద్ ఆఫ్రిదీ..

Babar Azam

ఆఫ్రిదీ వ్యాఖ్యలను బట్టి చూస్తే బాబర్ ఆజమ్‌ని టీ20 ఫార్మాట్‌కి మాత్రమే కెప్టెన్‌గా పరిమితం చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వన్డే, టెస్టు ఫార్మాట్‌లో షాన్ మసూద్‌కి కెప్టెన్సీ అప్పగించాలని పీసీబీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.. 

click me!