కౌంటీ క్రికెట్ ఆడతానన్న స్టీవ్ స్మిత్.. భగ్గుమంటున్న ఇంగ్లాండ్ ఫ్యాన్స్

Published : Jan 20, 2023, 04:32 PM IST

Steve Smith: ఆస్ట్రేలియా మాజీ సారథి  స్టీవ్ స్మిత్  త్వరలో కౌంటీ క్రికెట్ ఆడబోతున్నాడు. తన కెరీర్ లో తొలిసారి ఈ ఆసీస్ వెటరన్ బ్యాటర్  కౌంటీ క్రికెట్ లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. 

PREV
16
కౌంటీ క్రికెట్ ఆడతానన్న స్టీవ్ స్మిత్.. భగ్గుమంటున్న ఇంగ్లాండ్ ఫ్యాన్స్

ఆసీస్ మాజీ సారథి  ప్రస్తుతం టెస్టు జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న స్టీవ్ స్మిత్ త్వరలోనే   ఇంగ్లాండ్ లో జరిగే కౌంటీ క్రికెట్  ఆడనున్నాడు.  సుదీర్ఘకాలంగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నా స్మిత్  కౌంటీలు ఆడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.  

26

కౌంటీలలో స్మిత్.. ససెక్స్  టీమ్ తో   కలువనున్నాడు.  ససెక్స్ తరఫున మూడు మ్యాచ్ లు ఆడేందుకు గాను  స్మిత్ ఒప్పందం కుదుర్చుకున్నాడు.  దీనిపై ఇప్పటికే ససెక్స్ క్రికెట్ హెడ్ పాల్ పాబ్రేస్ తో మాట్లాడనని, కౌంటీలలో ఆడటం నిజమేనని  చెప్పాడు. యువ ఆటగాళ్లతో  డ్రెస్సింగ్ రూమ్ పంచుకుంటుండటం  ఎంతగానో ఉత్సాహంగా ఉందని, ఈ మ్యాచ్ ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు. 

36

అయితే  స్మిత్  కౌంటీ ఎంట్రీ పై ఇంగ్లాండ్ అభిమానులు మండిపడుతున్నారు. యాషెస్ సిరీస్ ముందున్న నేపథ్యంలో   స్మిత్ ఇక్కడి పరిస్థితులకు అలవాటుపడటానికే  ఇక్కడకు వస్తున్నాడని వాళ్లు వాపోతున్నారు.  యాషెస్ సిరీస్ కు ముందు ఆసీస్ ఆటగాళ్లకు  కౌంటీలలో ఆడటానికి అవకాశమిచ్చిన   ససెక్స్ పై  వాళ్లు భగ్గుమంటున్నారు. 

46

ఈ ఏడాది  జులైలో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) జరగాల్సి ఉంది.  అది ఇంగ్లాండ్ లోనే జరుగుతుంది. యాషెస్ కంటే ముందే టెస్ట్ ఛాంపియన్షిప్ కు  కూడా  ప్రీ ప్రాక్టీస్ గా ఉంటుందని స్మిత్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ను ఖాయం చేసుకుంది. ఆ జట్టు త్వరలో భారత్ తో నాలుగు టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్ లో గెలిచినా ఓడినా  ఆసీస్ కు పోయేదేమీ లేదు. 

56

ఇదిలాఉండగా  స్మిత్  కౌంటీ ఎంట్రీపై  ఇంగ్లాండ్ ఫ్యాన్స్ రచ్చ చేస్తుండగా  ఆ జట్టు మాజీ సారథి మైఖేల్ వాన్ మాత్రం  అందులో తప్పేముందని  అంటున్నాడు.  స్మిత్ వంటి మేటి క్రికెటర్లు కౌంటీలు ఆడితే  అది యువ క్రికెటర్లకు  చాలా ఉపకరిస్తుందని, ఈ విషయంలో ఇంత రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని చెప్పాడు. 
 

66

మరోవైపు  స్మిత్ కౌంటీలలో ఆడటంపై  ఇంగ్లాండ్  సారథి (టెస్టులకు) బెన్ స్టోక్స్   కూడా ఇంగ్లాండ్ ఫ్యాన్స్ తరఫునే మాట్లాడాడు.  యాషెస్ సిరీస్ కు ముందు   సస్సెక్స్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదని పెదవి విరిచాడు.  వాన్ వ్యాఖ్యలతో విభేదించనప్పటికీ.. ఫ్యాన్స్ ను కూడా ఖుషీ  చేశాడు.

click me!

Recommended Stories