రోహిత్ వీక్‌నెస్ పసిగట్టా! రాహుల్‌ వికెట్ పడింది మాత్రం అతని వల్లే... షాహీన్ ఆఫ్రిదీ కామెంట్స్...

First Published | Oct 21, 2022, 9:54 AM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ముందు టైటిల్ ఫెవరెట్ టీమిండియానే. అంతకుముందు ద్వైపాక్షిక సిరీసుల్లో దుమ్ముదులిపి, ప్రాక్టీస్ మ్యాచుల్లో ప్రత్యర్థులను చిత్తు చేసిన భారత జట్టును ఏ టీమ్ ఆపలేదని అనుకున్నారంతా. అయితే టోర్నీ ప్రారంభమయ్యాక ఈ కమ్ముకున్న మేఘాలన్నీ తొలగిపోయాయి...
 

shaheen

టీ20 వరల్డ్ కప్ 2021 ఇన్నింగ్స్ మొదటి బంతికే రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. అక్కడే ఆ మూమెంట్‌లోనే టీమిండియాలోనే అప్పటిదాకా ఉన్న ఉత్సాహం ఆవిరైంది... ఆ తర్వాతి ఓవర్‌లో కెఎల్ రాహుల్ అవుటైన విధానం టీమిండియా ఫ్యాన్స్‌ని షాక్‌కి గురి చేసింది...

ఐపీఎల్ 2021 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరుపున ఆడిన కెఎల్ రాహుల్, 600+కి పైగా పరుగులు చేసి అదరగొట్టాడు. బీభత్సమైన ఫామ్‌లో ఉన్న కెఎల్ రాహుల్, టీమిండియాకి కీ బ్యాటర్ అవుతాడని భావించారంతా...


Shaheen Afridi

ఓపెనర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరినా ఈ మాత్రం స్కోరు చేయగలిగిన భారత జట్టు, బౌలింగ్‌లో తేలిపోయింది. మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ అజేయంగా 152 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో పాక్‌పై టీమిండియాపై మొట్టమొదటి విజయం అందించారు...

shaheen

‘రోహిత్ శర్మ వికెట్ తీయడం కోసం చాలా స్టడీ చేశా. అతని బ్యాటింగ్ వీడియోలు చూశాక రోహిత్ యార్కర్ లెంగ్త్‌లో వచ్చే ఇన్‌స్వింగ్ బంతులను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడతాడని గమనించా. అయితే అతనికి ఎక్కువ సమయం ఇవ్వకుండా మొదటి బంతికి అదే అస్త్రాన్ని ప్రయోగించా...

అదృష్టవశాత్తు రోహిత్ వీక్‌నెసే నా బలం. ఇన్నింగ్స్ మొదటి బంతికే ఇన్‌స్వింగ్ యార్కర్ వేశా, వికెట్ వచ్చింది. తొలి బంతికే వికెట్ దక్కుతుందని మాత్రం అనుకోలేదు. ప్లాన్ వర్క‌వుడ్ కావడంతో నాలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది...

Shaheen Afridi-Virat Kohli

కెఎల్ రాహుల్ వికెట్‌ మాత్రం షోయబ్ మాలిక్ భాయ్ ప్లానింగ్‌తో వచ్చింది. రెండో ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చినప్పుడు లెంగ్త్ బాల్ వేయాల్సిందిగా మాలిక్ సూచించాడు. నేను అదే చేశా. కెఎల్ రాహుల్ ఆ బాల్‌ని పూర్తిగా మిస్ అయ్యాడు, వికెట్ దొరికింది... ఆ మ్యాచ్‌లో ఈ రెండు వికెట్లు చాలా ఎంజాయ్ చేశా..’ అంటూ కామెంట్ చేశాడు పాక్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిదీ...

Shaheen Afridi

49 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 57 పరుగులు చేసిన భారత సారథి విరాట్ కోహ్లీ కూడా షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లోనే వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. షాహీన్ ఆఫ్రిదీని ఈసారి కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది...

Latest Videos

click me!